Advertisementt

బెల్లంకొండ స్టూడెంట్ కి డేట్ ఫిక్స్

Fri 17th Feb 2023 01:16 PM
bellamkonda ganesh,nenu student sir!  బెల్లంకొండ స్టూడెంట్ కి డేట్ ఫిక్స్
Nenu Student Sir! Releasing On March 10th బెల్లంకొండ స్టూడెంట్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్వాతిముత్యం తోనే ప్రేక్షకులని పడేసాడు. ఆ ఉత్సాహంతోనే బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా నేను స్టూడెంట్ సార్!తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. నేను స్టూడెంట్ సార్! మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. ప్రధాన తారాగణం సీరియస్ లుక్ లో ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్  చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Nenu Student Sir! Releasing On March 10th:

Bellamkonda Ganesh Nenu Student Sir! Releasing On March 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ