Advertisementt

శాకుంతలం నుంచి మధుర గతమా.. సాంగ్

Wed 15th Feb 2023 03:05 PM
shaakuntalam,madhura gathama  శాకుంతలం నుంచి మధుర గతమా.. సాంగ్
Shaakuntalam Madhura Gathama song out శాకుంతలం నుంచి మధుర గతమా.. సాంగ్
Advertisement
Ads by CJ

మ‌ధుర గ‌త‌మా

కాలాన్నే ఆప‌కా

ఆగావే సాగ‌కా

అంగుళిక‌మా

జాలైనా చూప‌కా

చేజారావే వంచికా..’

అని దుష్యంతుడికి దూరమైన శకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగ‌రాన్ని పోగొట్టుకుంది శకుంత‌ల‌. శాపం కార‌ణంగా దుష్యంతుడు కూడా త‌న భార్య‌ను మ‌ర‌చిపోతాడు. అలాంటి ప‌రిస్థితుల్లో అస‌హాయురాలైన ఆమె ఏం చేస్తుంది?  శ‌కుంత‌ల‌ మ‌నసుకి త‌గిలిన గాయాన్ని కాలం ఎలా మాన్పించింది అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘శాకుంతలం’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో 3D టెక్నాల‌జీతో  విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందుతోన్న పౌరాణిక ప్రేమ క‌థా చిత్రం శాకుంతలం. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా.. శకుంతల పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత ఒదిగిపోయింది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాలం ప‌రిగెడుతున్నా ఇప్ప‌టికీ ఎప్పటికీ నిత్య నూత‌నంగా ఉండేలా అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు, శకుంత‌ల ప్రేమ‌ను క‌వి కాళిదాసు అద్భుతంగా వ‌ర్ణిస్తే దాన్ని మంచిపోయేలా అబ్బుర ప‌రిచే సాంకేతిక విలువ‌ల‌తో.. ప్ర‌తి ఫ్రేమ్‌ను క‌ళ్ల‌ప్ప‌గించి చూసేంత గొప్ప‌గా తెరకెక్కించారు డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్‌. ఆ విష‌యం ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌తో క్లియ‌ర్‌గా తెలిసింది. మంగ‌ళ‌వారం ఈ విజువ‌ల్ వండ‌ర్ నుంచి మధుర గతమా.. అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Shaakuntalam Madhura Gathama song out:

Shaakuntalam from Madhura Gathama song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ