Advertisementt

శాకుంతలం కొత్త రిలీజ్ డేట్

Fri 10th Feb 2023 05:10 PM
samantha,shaakuntalam  శాకుంతలం కొత్త రిలీజ్ డేట్
Shaakuntalam new release date out శాకుంతలం కొత్త రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

శకుంత‌లగా బ్యూటీఫుల్ హీరోయిన్ స‌మంత ..దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టిస్తోన్న‌ పౌరాణిక ప్రేమ క‌థా చిత్రం శాకుంతలం. గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ ల‌వ్ స్టోరి ఈ నెల 17న మహా శివరాత్రి స్పెషల్ గా విడుదలకావాల్సి ఉండగా.. ఆ డేట్ నుండి శాకుంతలం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పుడు మేకర్స్ కొత్త రిలీజ్ ప్రకటించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న శాకుంతలం రిలీజ్ అవుతుంది. సినిమా అనేది లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్ర‌తి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, మల్లికా మల్లికా.. సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.  

Shaakuntalam new release date out:

Samantha Shaakuntalam gets a new release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ