Advertisementt

బ్రహ్మ వరం పీఎస్ పరిధిలో ఫస్ట్ లుక్

Thu 09th Feb 2023 01:59 PM
bramhavaram ps paridhilo movie  బ్రహ్మ వరం పీఎస్ పరిధిలో ఫస్ట్ లుక్
Bramhavaram PS paridhilo movie First look బ్రహ్మ వరం పీఎస్ పరిధిలో ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

బ్రహ్మవరం p.s పరిధిలో.. ఏం జరిగింది.అనేదే ఈ సినిమా కథ.దీనికి మేము ఒక థిమ్ లైన్ ఇచ్చాము. అదేంటి అంటే సమ్ టైమ్స్ మిస్టేక్స్ బ్రింగ్ జస్టిస్ అంటే కొన్ని సార్లు మనం చేసే తప్పులు కూడా.. కొంత జస్టిస్ ను తీసుకొస్తాయి. తప్పులు జస్టిస్ ను తీసుకు రావడం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే బ్రహ్మవరం పీఎస్ పరిధిలో సినిమా చూస్తే  తెలుస్తుంది అంటున్నారు దర్శకులు ఇమ్రాన్ శాస్రి.. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, రూపా లక్ష్మి, బెల్లం కొండ స్రవంతి, హర్షిని,గురు చరణ్, సూర్య, నటీ నటులుగా ఇమ్రాన్ శాస్రి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ నిర్మిస్తున్న చిత్రం బ్రహ్మవరం పీఎస్ పరిధిలో ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. నేను ఈ కథ చదివాను. చాలా బాగా నచ్చింది.కథకు తగ్గట్టే మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ దొరికారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

నటుడు ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. దర్శకుడు ఇమ్రాన్ శాస్రి కొత్త వాడైనా కథ పై మంచి క్లారిటీ తో ఉన్నాడు. మా అందరి నుండి చక్కటి నటనను రాబట్టు కున్నాడు.మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న ఈ  సినిమాను చిన్న సినిమా అని చూడకుండా సమాజానికి పనికివచ్చే ఒక మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాలు చూడండి. చూసిన వారందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అలాగే మంచి మెసేజ్ తో వస్తున్న ఈ సినిమాను ప్రజలందరూ ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ముజీర్ మాలిక్ మాట్లాడుతూ.. గురు ద్వారా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఇలాంటి మంచి బ్యానర్లో చేయడం చాలా హ్యాపీ గా ఉంది.మా మీద నమ్మకం పెట్టుకొని తీసిన డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ వారికి నా ధన్యవాదాలు. ఈ మూవీలో జీవా గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు, సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, రూపా లక్ష్మి, హర్షిని, సూర్య, ఇలా అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు ఇమ్రాన్ కొత్తవాడైనా కూడా అనుకున్న టైమ్ లో సినిమాను షూటింగ్ పూర్తి చేశాడు. 

హీరోయిన్ బెల్లం కొండ స్రవంతి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాకు ముజీర్ గారే ఆఫ్ స్క్రీన్ హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే తను మాకు చాలా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. శ్రీనివాస్ మౌళి గారు మంచి లిరిక్స్ రాశారు. ఇందులో సాంగ్స్ చాలా వెరైటీగా చేయడానికి ట్రై చేసారు దర్శకులు ఇమ్రాన్. ఈ సినిమా అన్ని వర్గాల వారికి  నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్  ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఇందులో చక్కటి సస్పెన్స్ తో పాటు సినిమా మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.అలాగే ఇందులో ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఇంకా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా చేయడం జరిగింది. ఈ సినిమాను చాలా మంది ఫ్రెండ్స్ కలసి నిర్మించారు. అందుకే డ్రీమ్జ్ ఆన్ రీల్జ్. అని పేరు పెట్టాము. వారందరూ బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేయడం వల్ల వారందరికీ తరుపున రిప్రజెంటేటివ్ గా ఉంటూ ఈ సినిమా చేయ గలిగాను. ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు చాలా బాగా నటించారు. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి మాట్లాడుతూ.. బ్రహ్మ వరం సినిమాకి రచన దర్శకత్వం వహించాను.ఇప్పుడు వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథలు అన్నీ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ ఏ దాన్ని చివరి వరకు సస్పెన్స్ చేసుకుంటూ వెళ్లి రివీల్ చేయడం జరుగుతుంది. అయితే వాటికీ భిన్నంగా మేము ఫ్యామిలీ డ్రామా తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ ను జోడించి ఈ సినిమా తియ్యడం జరిగింది. నన్ను నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన డ్రీమ్జ్ రీల్జ్ వారికి నేను రుణపడి ఉంటాను. వారంతా అమెరికాలో ఉన్నా కూడా సినిమాకు ఏమి కావాలన్నా ఖర్చుకు వెనుకడకుండా అన్ని సమాకూర్చారు.

నటుడు గురు మాట్లాడుతూ.. బ్రహ్మ వరం పరిధిలో సినిమా తీస్తున్న దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి, మేమందరం సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిమానులం. ఇమ్రాన్ ముస్లిం అయినా తనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిపై ఉన్న అభిమానంతో తన పేరు పక్కన శాస్రి అని పెట్టుకున్నాడు. మంచి థ్రిల్లర్ సినిమా చేద్దామని నన్ను అప్రోచ్ అవ్వడంతో మేమిద్దరం కలసి ఈ కథ పై చాలా రోజులు వర్క్ చేశాము. తను రాసుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేసి నటుడు ప్రేమ్ సాగర్ కు, నటి రూపా లక్ష్మి, సమ్మెట గాంధీ ఇలా ఒక్కొక్కరికీ ఈ కథని నేరెట్ చేసుకుంటూ వచ్చాము.ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చేయడానికి ముందుకు రావడంతో మాకు ఈకథపై ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాలో నటించిన వారందరు చాలా చక్కగా నటించారు. ఇందులో స్రవంతి బెల్లంకొండ మెయిన్ లీడ్ గా నటించింది. బెల్లం కొండ స్రవంతి కి ఇది మొదటి సినిమా అయినా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటిలా ఎమోషనల్ సీన్స్ లలో చాలా అద్భుతంగా నటించింది. సినిమాటో గ్రాఫర్ ముజీర్ మాలిక్ గారు మాకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. ప్రొడక్షన్ పరంగా వచ్చే సరికి  నిర్మాతలు అమెరికాలో ఉన్నా కూడా  సినిమాకు ఏమి కావాలంటే అది ఖర్చుకు వెనుకడకుండా ఈ సినిమాను నిర్మించారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేవిధంగా దర్శకుడు చాలా డిఫరెంట్ గా తీశాడు.

సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ గా నాకిది 38వ సినిమా డ్రీమ్స్ ఆర్ రీల్జ్ బ్యానర్ పై డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా వుంది. కంటెంట్ ని నమ్ముకుని చేసిన ఈ సినిమాలో ఉన్న పాటలు అన్నీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయని ఆశిస్తున్నాను అన్నారు.

నటి హర్షిని మాట్లాడుతూ.. చాలా మూవీస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ  కొన్ని మూవీస్ మాత్రమే గుర్తుండిపోతాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకు వచ్చిన తరువాత మంచి కంటెంట్ ఉన్న ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చితే కేవలం మౌత్ టాక్ తోనే  బిగ్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా నా కెరియర్ కు మంచి ప్లస్ అవుతుంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటుడు సూర్య మాట్లాడుతూ.. సాగర్ గారు సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Bramhavaram PS paridhilo movie First look Video👇

Bramhavaram PS paridhilo movie First look:

Bramhavaram PS paridhilo movie First look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ