కవలలు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్సవం సందర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. నిజ జీవితంలోని కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్పరుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. మా పిల్లలు రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్టర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది.
ముఖ్య అతిథి స్టంట్ మాన్ బద్రీ మాట్లాడుతూ... హీరోలిద్దరూ గర్వపడేలా ఎదగాలి. నటుడు అనేవాడు కష్టపడితేనే గొప్పగా ఎదుగుతాడు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొడుకులు నటులుగా ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు.
హీరోలు రామకృష్ణ, హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా మేం హీరోలుగా పరిచయం అవుతున్నాం. మీ అందరి సపోర్టు కావాలి. మీ ఆశీస్సులు ఉండాలి. చిన్నప్పటి నుంచి నటులం కావాలనే డ్రీమ్ ఉండేది అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రేక్షకులను మెప్పించేలా మేం నటిస్తాం సినిమాను ఆదరించాలి.
మీలో ఒక్కడు చిత్ర నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... TSR మూవీ మేకర్స్ సంస్థ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలు చేయాలి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పూర్తి వివరాలు అతి త్వరలోనే నిర్మాత ప్రకటిస్తారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
TRS Movie Makers New Movie Opening Video👇