ప్రపంచవ్యాప్తంగా ఓటీటి వేదికగా సంచలన విజయం సాధించిన ఫ్యామిలీమాన్ వన్, టూలలో ప్రధాన భూమికను పోషించి అన్ని భాషా చిత్రపరిశ్రమలలో అద్భుతమైన కిర్తి ప్రతిష్టలను సాధించిన అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్న శాంతల అనే పీరియడ్ చిత్రం చికమంగుళూరులో ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. విజయవాడకు చెందిన డాక్టర్ ఇర్రంకి సురేష్, అయన సోదరుడు సత్య సంయుక్తంగా వారి మాతృమూర్తి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండోఅమెరికన్ ఆర్ట్స్ బ్యానర్ పైన తయారవుతున్న ఈ సంగీత నృత్య భరిత చిత్రం శాంతల సుప్రసిద్ద దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర అనేక చిత్రాలకు పనిచేసి త్రివిక్రమ్ శేషుగా గుర్తింపు పొందిన శేషు నిర్దేశకత్వంలో తెరకెక్కడం ఓ విశేషం. శాంతల చిత్రంలో బటర్ ఫ్లై చిత్రం ద్వారా హీరోగా చేసిన నీహల్ కాదనాయకుడిగా నటిస్తున్నారు.
సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమాకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించడం మరొక ముఖ్య విశేషం. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చికమంగుళూరు, పరిసర ప్రాంతాలలో ఆద్యంతం రూపొందుతోంది. వెంకటేష్, భూమిక కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత కె. స్. రామారావు నిర్మించిన సూపరహిట్ చిత్రం వాసు కి పనిచేసిన రమేష్ శాంతల చిత్రానికి సినిమాటోగ్రాఫర్. నేడు ప్రారంభమైన శాంతల చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మార్చ్ నెలాఖరు వరకు ఏకధాటిగా జరగడంతో చిత్రనిర్మాణం పూర్తి అవుతుందని నిర్మాతలలో ఒకరైన డాక్టర్ ఇర్రంకి సురేష్ తెలియజేశారు. ఆసక్తికరమైన అనేక సన్నివేశాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కధాంశంతో పాటూ అద్భుతమైన సంగీతం శాంతల చిత్రానికి ప్రధానమైన ఆకర్షణలు అని డాక్టర్ సురేష్ చెప్పారు.