ప్రముఖ సీనియర్ దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ కొద్దిసేపటి క్రితమే (గురువారం రాత్రి) అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1930 జనవరి 19 న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన కె విశ్వనాథ్ వయసు 92 సంవత్సరాలు. 50 కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఆత్మగౌరవం.
కళాతపస్వి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. కె విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.