Advertisementt

హంట్ ట్రైలర్ రివ్యూ

Wed 18th Jan 2023 12:17 PM
hunt trailer review  హంట్ ట్రైలర్ రివ్యూ
Hunt Trailer review హంట్ ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా హంట్. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ఉదయం 10.01 గంటలకు పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు

హంట్ సినిమాలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అందులో మెమరీ లాస్‌కు ముందు కలిసిన వ్యక్తులు, జరిగిన ఘటనలు అర్జున్‌కు గుర్తు లేవు కానీ... పోలీస్ ట్రైనింగ్, భాషలు, స్కిల్స్ గుర్తు ఉన్నాయని చెప్పారు. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే...  

ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్‌లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్‌లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. 

మెమరీ లాస్‌కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 

కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, 18 రోజుల్లో సంపాదించిన క్లూస్ శ్రీకాంత్‌కు సుధీర్‌ బాబు ఎందుకు ఇచ్చారు? రెండూ ఒకేసారి చదవమని ఎందుకు చెప్పారు? ఆ బ్లాంక్ పేజీ ఏమిటి? అనేది మరింత క్యూరియాసిటీ పెంచింది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ స్టంట్స్ ఉన్నాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని హంట్ ట్రైలర్ లో ఇంప్రెస్స్ అయ్యేలా  ఉన్నాయి. 

Hunt Trailer review:

Sudheer Babu Hunt Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ