Advertisementt

షూటింగ్ లో గాయపడిన పల్లవి జోషి

Mon 16th Jan 2023 07:45 PM
actress pallavi joshi  షూటింగ్ లో గాయపడిన పల్లవి జోషి
Pallavi Joshi Injured On The Vaccine War Sets షూటింగ్ లో గాయపడిన పల్లవి జోషి
Advertisement
Ads by CJ

ది కాశ్మీర్ ఫైల్స్ తో సంచలన సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ది వాక్సిన్ వార్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సెట్ లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఓ వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ  ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందని, అభిమానులెవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర బృందం తెలియజేసింది.

2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.

Pallavi Joshi Injured On The Vaccine War Sets :

Actress Pallavi Joshi Injured On The Vaccine War Sets In Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ