Advertisementt

స‌మంత శాకుంతలం డేట్ ఫిక్స్

Mon 02nd Jan 2023 12:49 PM
samantha,shaakuntalam movie  స‌మంత శాకుంతలం డేట్ ఫిక్స్
Shaakuntalam release worldwide on February 17 స‌మంత శాకుంతలం డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం. ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులు 2023లో చూడాల‌నుకుని ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న విజువ‌ల్ వండ‌ర్‌గా శాకుంత‌లం త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. అందాల సుంద‌రి స‌మంత ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమ‌గాథ‌నున‌ భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా గుణ‌శేఖ‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు  అజ‌రామ‌ర‌మైన ప్రేమ క‌థ‌ ఇది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న శాకుంత‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకునే ప‌నిలో ఉంది. శాకుంత‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు నిర్మాత‌లు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి ఈ సినిమాను 3Dలో రూపొందిస్తున్నారు.

స‌మంత టైటిల్ పాత్ర‌ధారిగా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో  డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.

Shaakuntalam release worldwide on February 17:

Samantha Shaakuntalam release worldwide on February 17

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ