Advertisementt

ప్రభాస్-బాలయ్యల డబుల్ ధమాకా

Wed 28th Dec 2022 07:41 PM
unstoppable,baahubali,prabhas,balakrishna  ప్రభాస్-బాలయ్యల డబుల్ ధమాకా
Unstoppable Baahubali episode in two parts ప్రభాస్-బాలయ్యల డబుల్ ధమాకా
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్‌గా విశేషమైన అభిమానులని సొంతం చేసుకున్న స్టార్ ప్ర‌భాస్‌.. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో, గ్రేస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్నారాయ‌న‌. ప్రభాస్ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న‌ పాపుల‌ర్ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌లో పాల్గొన్న తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ప్ర‌భాస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. నంద‌మూరి బాల‌కృష్ణ అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్ ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ను ఆహా సిద్ధం చేసింది. ఇంత గొప్ప ఎపిసోడ్‌ను ఎడిట చేయ‌టానికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దే. దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలి. 

దీంతో ఆహా.. ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇది అభిమానులకు సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. అవును నిజమే 100 నిమిషాల బాహుబలి ఎపిసోడ్‌ని బాహుబలి - అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే 1 ది బిగినింగ్ డిసెంబ‌ర్ 30న కొత్త సంవత్సరాది ట్రీట్‌గా ప్ర‌సారం కానుంది.  అలాగే బాహుబలి అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే 1 క‌న్‌క్లూజ‌న్  జ‌న‌వ‌రి 6న ప్ర‌సారం కానుంది. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే హిస్ట‌రీలో ఓ ఎపిసోడ్‌ను రెండు ఎపిసోడ్స్‌గా అందించ‌టం ఇదే మొద‌టిసారి. డిసెంబ‌ర్ 30న ప్ర‌సారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. 

ఇది ఆహాలో మాత్ర‌మే ఎక్స్‌క్లూజివ్‌గా కొత్త సంవ‌త్స‌రం ట్రీట్‌గా రానుంది. ఇక డిసెంబ‌ర్ 6న ప్ర‌సారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌, ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది. ఇందులో ప్ర‌భాస్‌, గోపీచంద్ కెరీర్ ఇండ‌స్ట్రీలో ఎలా ప్రారంభ‌మైంది. వారి స్నేహం ఎలా ప్రారంభ‌మైంది..ఇన్నేళ్ల‌లో ఎలా బ‌ల‌ప‌డింది అనే విష‌యాలుంటాయి.

మాకు అభిమానుల నుంచి లెక్కలేనని మెసేజెస్ వచ్చాయి. ఈ  ఎపిసోడ్‌ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాల‌ని వారు కోరారు. అలాగే ఆహా, ప్ర‌భాస్ ఎపిసోడ్ ఫైన‌ల్ ఔట్‌పుట్ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో ప్ర‌భాస్‌, నంద‌మూరి బాల‌కృష్ణ, ఆహా టీమ్ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్న త‌ర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. న్యూ ఇయ‌ర్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌తో ఆహాలో రాబోతున్న ఈ టాక్ షో ఎపిసోడ్ కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి ఏముంటుంది. ఎవ‌రూ ఊహించ‌లేని కొత్త విష‌యాలు, అంత‌కు మించిన ఫ‌న్ డిసెంబ‌ర్ 30, జ‌న‌వ‌రి 6న ఆహా ద్వారా స్క్రీన్స్‌ను ఢీ కొట్ట‌నుంది అని ఆహా టీమ్ తెలియజేసింది.  

ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌లో ఓ చిన్న ఫ‌న్ గేమ్ ఉంది. తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌.. ప్ర‌భాస్ సీత‌తో ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న ఏమ‌ని బ‌దులిచ్చారు. ప్రేక్ష‌కులకు ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని విష‌యాలు ఏం తెలియ‌సాయ‌నేది ఆస‌క్తిక‌ర‌మైన కొన‌సాగిపుంగా ఉంటుంది.

Unstoppable Baahubali episode in two parts:

Unstoppable Baahubali episode double sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ