Advertisementt

వీరయ్య కూడా వస్తున్నాడు

Sat 24th Dec 2022 07:20 PM
waltair veerayya,chiranjeevi  వీరయ్య కూడా వస్తున్నాడు
Waltair Veerayya Title Song On వీరయ్య కూడా వస్తున్నాడు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ హోరెత్తిపోతున్నాయి. బాలకృష్ణ వీరసింహ రెడ్డి థర్డ్ సింగిల్ తో దుమ్మురేపుతున్నారు. ఈ రోజే మా బావ మనోభావాలతో మాస్ ఆడియన్స్ ని ఉర్రుతలూగించారు. ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోయే మరో మూవీ వాల్తేర్ వీరయ్య మూడో సింగల్ అప్ డేట్ రానే వచ్చింది..

 మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లిల మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతిసారీ చిరంజీవి కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ లు అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో సంచలన ఆల్బమ్‌ ను అందించాడు. ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. 

ఇప్పుడు మూడవ సింగిల్ కోసం సమయం వచ్చంది.

డిసెంబరు 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నారు. ఈ రాకింగ్ ట్రాక్‌ తో డిఎస్పీ  పూనకాలు అందించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అవతార్‌ లో ప్రజంట్ చేసింది. పోస్టర్‌ లో చేతిలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ పట్టుకుని కనిపించారు. షేడ్స్‌పై ఫైర్ ఫ్లేమ్స్ ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు.ఈ గెటప్, చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ గ్యాంగ్ లీడర్‌ ను గుర్తు చేస్తుంది.

Waltair Veerayya Title Song On :

Chiranjeevi Waltair Veerayya Title Song On December 26th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ