Advertisementt

నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ని సాంగ్ వచ్చేస్తుంది

Sat 17th Dec 2022 04:58 PM
waltair veerayya,chiranjeevi  నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ని సాంగ్ వచ్చేస్తుంది
Nuvvu Sridevi Nenu Chiranjeevi Releasing on December 19th నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ని సాంగ్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లిల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్  కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 19న సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ విషయాన్ని ప్రకటిస్తూ  చిరంజీవి, శృతి హాసన్‌ల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రుతి హాసన్‌, చిరంజీవికి జోడిగా చూడటం ఇదే మొదటిసారి. శ్రుతి హాసన్ చాలా అంటే చాలా అందంగా ఉంది. బాస్, శృతి హాసన్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ ట్రీట్ ని స్కోర్ చేశారు. చిరంజీవి లీక్ చేసిన వీడియో ద్వారా  ఇప్పటికే  చిన్న గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో మంచుతో కప్పబడిన లొకేషన్ కన్నుల పండువగా కనిపిస్తోంది.  

సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు.  

Nuvvu Sridevi Nenu Chiranjeevi Releasing on December 19th:

Waltair Veerayya Second Single Releasing on December 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ