Advertisementt

వాల్తేరు వీరయ్య: రవితేజ లుక్ ముహూర్తం ఫిక్స్

Fri 09th Dec 2022 04:43 PM
ravi tej,chiranjeevi,bobby kolli,waltair veerayya  వాల్తేరు వీరయ్య: రవితేజ లుక్ ముహూర్తం ఫిక్స్
Ravi Tej First Look From Waltair Veerayya On December 12th వాల్తేరు వీరయ్య: రవితేజ లుక్ ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి తో మొదటిసారి కీ రోల్ ప్లే చేస్తున్న మాస్ మహారాజా రవితేజ వాల్తేరు వీరయ్యలో క్రేజీగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి.

ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ గురించి అప్‌ డేట్ వచ్చింది. రవితేజ ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయడానికి మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. మాస్ ఈజ్ కమింగ్ అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌ లో లీడ్‌ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Ravi Tej First Look From Waltair Veerayya On December 12th:

Ravi Tej First Look From Mega Star Chiranjeevi Veerayya On December 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ