Advertisementt

యూవీ రిలీజ్ చేస్తున్న నయన్ కనెక్ట్

Mon 05th Dec 2022 10:28 AM
nayanthara,connect movie  యూవీ రిలీజ్ చేస్తున్న నయన్ కనెక్ట్
Nayanthara Connect release on.. యూవీ రిలీజ్ చేస్తున్న నయన్ కనెక్ట్
Advertisement
Ads by CJ

లేడీ ఒరింటెడ్ ఫిలిమ్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ నయనతార. తాజాగా నయన్ నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. 

హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన మయూరి సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది.  అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన గేమ్ ఓవర్ కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Nayanthara Connect release on..:

Nayanthara Connect release on Dec 22

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ