టాలీవుడ్ కి ఆ నలుగురు చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, పెళ్లయిన కొత్తలో చిత్రంతో దర్శకుడిగా మారిన మదన్ ఆకస్మికంగా మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్... హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... (ఈ రోజు శనివారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
ఈయన స్వస్థలం మదనపల్లి. పెళ్ళైన కొత్తలో తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి. మదన్ మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.