వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం సార్(తెలుగు), వాతి(తమిళం) చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ పై మేకర్స్ వెనక్కి తగ్గారు. ఇప్పుడు సర్ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
రిలీజ్ డేట్ కి సంభందించి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో హీరో ధనుష్ కాలేజ్ మెట్లమీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని ఉన్న వైనం అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన మాస్టారు మాస్టారు గీతం చాట్ బస్టర్స్ లో అగ్రగామిగా నిలవడంతో పాటు, చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ సార్ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఆలోచింప చేస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో సార్ 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.