Advertisementt

ప్రభాస్ 20 ఏళ్ల నట ప్రస్థానం

Fri 11th Nov 2022 03:55 PM
prabhas,telugu film industry  ప్రభాస్ 20 ఏళ్ల నట ప్రస్థానం
Prabhas Is Now 20 Years Old In The Industry! ప్రభాస్ 20 ఏళ్ల నట ప్రస్థానం
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ వారసత్వంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం, ప్రతిభతో టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు ప్రభాస్. తొలి చిత్రంలోనే ప్రభాస్ చూపించిన మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికేశాడనే ఇండికేషన్స్ పంపించింది. ఈశ్వర్ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రభాస్ స్టార్ డమ్ ఖాయమైంది. ఈ సినిమా విడుదలైన ఇవాళ్టికి 20 ఇళ్లు. నవంబర్ 11, 2002లో ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా 20వ యానివర్సరీ అంటే ట్వంటీ ఫ్యాబులస్ ఇయర్స్ టు డార్లింగ్ ప్రభాస్ అని సెలబ్రేట్ చేసుకోవచ్చు.

ఈశ్వర్ సినిమా వేసిన బలమైన పునాదితో పాన్ ఇండియా స్టార్ డమ్ అనే సౌధాన్ని అందంగా నిర్మించుకున్నారు ప్రభాస్. సక్సెస్ వెంట పరుగులు పెట్టే స్వభావం ఆయనలో ఎక్కడా చూడం. మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటూ వాటితోనే సక్సెస్ లు సాధించారు. మచ్చలేని తన వ్యక్తిత్వం, సింప్లిసిటీ ఆయనకు కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. 

వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధిస్తూ బాక్సాఫీస్ కు కింగ్ సైజ్ కలెక్షన్స్ చూపించారు ప్రభాస్. 20 ఏళ్ళ ప్రభాస్ నట ప్రస్థానం తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో సువర్ణాధ్యాయమే. ఆయన సృష్టించబోతున్న కొత్త చరిత్రకు ఆరంభమే.

ఇష్టపడి సినిమా చేయడమే ప్రభాస్ కు తెలుసు. ఇదెలాంటి విజయాన్ని సాధిస్తుందనే లెక్కలు వేసుకోవడం ఆయనకు తెలియదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాహుబలి రెండు భాగాల కోసం నాలుగైదేళ్లు డేట్స్ కేటాయించడం ప్రభాస్ సాహసానికి నిదర్శనం. ఆ సినిమాల కోసం ప్రభాస్ పడిన కష్టాన్ని దిగ్ధర్శకుడు రాజమౌళి స్వయంగా పలు సందర్భాల్లో తెలిపారు. సహజంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలతే ఆయన అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తుంటారు. కానీ ప్రభాస్ సినిమా అభిమానులందరిదీ, ఆ గ్రాండియర్ ను తెరపై ఎంజాయ్ చేసేందుకు ఫలానా హీరో ఫ్యాన్స్ అనే బేధమే లేదు.హీరోలందరి ఫ్యాన్స్ ఇష్టపడే స్టార్ ప్రభాస్.

బాహుబలి ప్రపంచస్థాయి విజయం తర్వాత ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. దానికి తగినట్లే ఆయన తన లైనప్ చేసుకున్నారు. అన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే. ఇలా కాక మరోలా ఆయన ఇమేజ్ అంగీకరించే పరిస్థితి లేదు. ప్రభాస్ తో కేవలం తెలుగుకు పరిమితమయ్యే సినిమాలు ఊహించలేం. స్కై రేంజ్ లో ఎదిగిన మన డార్లింగ్ ఇమేజ్ ఆయన రానున్న సినిమాలన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. 

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్  సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు చిత్రాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఒక్కొక్కటిగా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలన్నీ భారతీయ సినీ పరిశ్రమ గర్వించే స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో ఇక రానున్నది ప్రభాస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలే అనుకోవచ్చు. ఇరవై ఏళ్లలో ప్రభాస్ సాధించిన ఘనత ఇది. అయినా ఇది ఆరంభమే అనేంత ఉత్సాహం ఈ పాన్ ఇండియా స్టార్ ది.

Prabhas Is Now 20 Years Old In The Industry!:

Pan India Star Prabhas Completed 20 Years in Telugu Film Industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ