హిట్ ద ఫస్ట్ కేస్ అంటూ విశ్వక్ సేన్.. పోలీస్ అధికారిగా ఆకట్టుకోగా.. నాని తన నిర్మాణంలో తెరకెక్కించిన సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హిట్ ద ఫస్ట్ కేస్ హిట్ అవడంతో.. సెకండ్ కేస్ అంటూ దానికి సీక్వెల్ మొదలు పెట్టారు. అయితే హిట్ ద సెకండ్ కేస్ లో హీరో మారిపోయాడు. విశ్వక్ ప్లేస్ లోకి అడివి శేష్ వచ్చాడు. దానికి కారణాలు బయటపెట్టాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇక నేడు హిట్ ద సెకండ్ కేస్ టీజర్ ని విడుదల చేసింది టీం.
KD గా అడివి శేష్ కూల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే కాదు, మీడియా మీద సెటైర్ కూడా వేసాడు. అలాగే తనకి అచ్చొచ్చిన లిప్ లాక్ తో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి చెలరేగిపోయాడు. ఫస్ట్ కేస్ కన్నా దారుణంగా సెకండ్ కేస్ ఉండబోతుంది అనే హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఓ అమ్మాయి కాళ్ళు, చేతులు, మెడ వేరు వేరు చేసాడు విలన్.. ఆ దృశ్యం చూడగానే కళ్ళు తిరిగిపడిపోవడం ఖాయం. మరి KD ఆ కేసుని ఎలా సాల్వ్ చేసాడో.. అనేది హిట్ ద సెకండ్ కేస్ కథ.. KD గా, పోలీస్ అధికారిగా అడివి శేష్ లుక్స్, రావు రమేష్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. ఏదైనా హిట్ ద ఫస్ట్ కేస్ కన్నా.. సెకండ్ కేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది.