పవన్ కళ్యాణ్ కి అలీ కి మధ్యన చాలామంచి అనుబంధం ఉండేది. అది ఒకప్పుడు. కానీ పవాన్ కళ్యాణ్ జనసేనలోకి వెళ్ళాక అలీ పై పవన్ కామెంట్స్ చెయ్యడం, అలీ పవన్ కి రివర్స్ కౌంటర్లు వేశాక.. అలీ మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపించలేదు. లేదంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ కి ఖచ్చితంగా ఓ పాత్ర ఉండేది. ఆల్మోస్ట్ పవన్ పక్కనే అలీ ఉండే కేరెక్టర్స్ అతనికి పడేవి. పవన్-అలీ రాజకీయాలు లోకి ఎంటర్ అయ్యాక ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. దానితో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో అలీ మిస్ అయ్యాడు.
అయితే తాజాగా అలీ పవన్ కళ్యాణ్ తన షో అలీతో సరదాగా షోకి రాబోతున్నాడంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ క్షణం తీరిక లేని బిజీ లైఫ్ లో ఆహా అన్ స్టాపబుల్ కి వెళ్లడమే షాకింగ్ అనుకుంటే.. ఇప్పుడు అలీతో సరదాగా షో కి రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటున్నారు. అలీ హోస్ట్‌గా చేస్తున్న అలీతో సరదాగా షో కి పవన్ త్వరలోనే రాబోతున్న విషయాన్ని అలీనే స్వయంగా చెప్పాడు. ఎప్పుడో ఈ షో కోసం పవన్ ని పిలిచామని బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయినట్లు చెప్పుకొచ్చిన అలీ.. త్వరలోనే వస్తారని కూడా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లో తనకి కేరెక్టర్స్ ఎందుకు రాలేదో కూడా రివీల్ చేసాడు. ఆ సినిమాలు రెండు సీరియస్ నెస్ తో తెరకెక్కినవి కాబట్టి, కామెడీకి స్కోప్ లేకపోవడమే తనకి ఆ సినిమాలో నటించడానికి అవకాశం రాకపోవడానికి కారణం అంటూ క్లారిటీ ఇచ్చాడు.