విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ చిత్రం లైగర్ కనీవినీ ఎరుగని నష్టాలలో కూరుకుపోవడంతో, ఆ చిత్రాన్ని కొన్నవారంతా తమకి నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. ఇది ఇంతటితో ఆగితే సరిపోయేది. కానీ, చిత్రాన్ని కొన్న బయ్యర్లు పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నా చేయడానికి సిద్దమవ్వడం, దానికి పూరి జగన్నాథ్ ఆగ్రహంగా వారికి ఒక్క పైసా చెల్లించేది లేదని చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది.
ఈ వివాదం పెద్దదవటంతో, పూరి జగన్నాథ్ హైదరాబాద్ పోలీసులని రక్షణ కోరాడు. తన ఫిర్యాదులో వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ జి.శోభన్ బాబు తనను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేసుత్నారని ఆరోపించాడు. తాను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని, హైదరాబాద్‌లో ఉంటున్న తన కుటుంబానికి భద్రత కల్పించాలని పూరీ జగన్నాథ్ తన ఫిర్యాదులో పోలీసులను అభ్యర్థించారు. మరి ఈ వివాదం ఇరు పక్షాల వాళ్ళు ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాలి.
కాని కొంతమంది ఇది పూరి స్వయంకృతమే నని, ఛార్మి, పూరి జగన్నాథ్, లైగర్ ఘోర పరాజయం చెందింనతర్వాత , పూరి జగన్నాథ్, ఛార్మి ఇల్లు అమ్ముకోవాల్సి వస్తోందని, వార్తలు వస్తుంటే, వాటిని కప్పిపుచ్చుకోడానికి, లైగర్ చిత్రం తమకి కోట్లలో లాభాలు తెచ్చిపెట్టిందని గొప్పలు చెప్పుకోగా, బయ్యర్లకి ఈ విషయం తెలిసి, ధర్నా చేస్తామని హెచ్చరించే స్థాయికి వచ్చారని అంటున్నారు.