Advertisementt

రొమాన్స్‌లో టాప్ గేర్ వేసిన ఆది సాయి కుమార్

Wed 26th Oct 2022 03:42 PM
top gear movie,aadi saikumar  రొమాన్స్‌లో టాప్ గేర్ వేసిన ఆది సాయి కుమార్
Top Gear Movie First Single To Be Out Soon రొమాన్స్‌లో టాప్ గేర్ వేసిన ఆది సాయి కుమార్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఆది సాయి కుమార్ వరుస సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ప్రేమ కావాలి సినిమాతో ఆడియెన్స్ ప్రేమ అందుకున్న ఆది సాయి కుమార్.. ఇప్పుడు చకచకా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. చివరగా తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో వంటి సినిమాలతో పలకరించిన ఆది.. త్వరలోనే  టాప్ గేర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభునిస్తుందని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్‌కి టాప్ గేర్ పడినట్లే అని చెబుతున్నారు.     

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సినిమాలోని ఇంకో యాంగిల్‌ను చూపిస్తోంది. యాక్షన్‌లోనే కాదు.. రొమాన్స్‌లోనూ టాప్ గేర్ వేస్తాను అన్నట్టుగా ఆది సాయి కుమార్ పోస్టర్ చెబుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరోయిన్‌ రియాన్ సుమన్‌, ఆది కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది.

ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 

జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Top Gear Movie First Single To Be Out Soon:

Romantic Side Of Aadi Saikumar s Top Gear Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ