Advertisementt

మెగా154 టైటిల్ టీజర్ కి టైమ్ ఫిక్స్

Thu 20th Oct 2022 07:22 PM
chiranjeevi,bobby,mega154 title teaser  మెగా154 టైటిల్ టీజర్ కి టైమ్ ఫిక్స్
Mega154 Title Teaser On October 24th మెగా154 టైటిల్ టీజర్ కి టైమ్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ లో పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154  రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటివలే మేకర్స్ ప్రకటించారు. 

ఈ రోజు టైటిల్ టీజర్ కి సంబధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24న ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.  ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిరంజీవి మాస్ లుక్  అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ పై బాస్ వస్తున్నాడు అని రాయడం అంచనాలని మరింత పెంచేసింది. సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Mega154 Title Teaser On October 24th:

Chiranjeevi-Bobby Mega154 Title Teaser On October 24th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ