ఈరోజు ఏపీ లో రాజకీయప్రకంపనలు మొదలయ్యాయి. ఎప్పుడు సహనంగా ఎదుటి వారికి సమాధానం ఇస్తూ.. కూల్ గా రాజకీయాలు చేసుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని, వైసిపి మంత్రులని చెడుగుడు ఆడేసారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెంపలు వాయిస్తానంటూ చెప్పు చేత బట్టారు. వైసిపి గుండా నాయకులు, నా కొడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. ఆయన భాషా, పవన్ స్టయిల్ అన్ని మారిపోయాయి. పర్ఫెక్ట్ రాజకీయనాయకుడిగా వైసిపి రౌడీ ఎమ్యెల్యేలకి గుండెల్లో గుబులు రేపాడు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే విడాకులిచ్చే పెళ్లి చేసుకున్నా.. మీలాగా 30 మంది స్టేఫినీలని మెయింటింగ్ చెయ్యలేదు అంటూ చాలా దారుణంగా కామెంట్స్ చేసారు.
అంతేకాదు ప్యాకేజ్ స్టార్ట్ అంటే గుడ్డలూడదీసి కొడతా, మెడ పిసికి చంపేస్తా, ఈరోజు నుండి ఏపీ ముఖచిత్రం మారబోతుంది, ఏపీ రాజకీయాల్లో కొత్తవరవడి మొదలవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయిన కాసేపటికే వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. వైసిపి కాపు ఎమ్యెల్యేలని తిడతావా సన్నాసిన్నారా సన్నాసి అంటూ ఆయన మాటలు తూటాలు పేల్చేచారు. చంద్రబాబుకి చెంచా పవన్ అంటూ దారుణమైన పదజాలంతో నాని రెచ్చిపోతున్న టైం లో ఏపీ రాజకీయం విజయవాడ నోవా టెల్ లో మొదలైంది. పేర్ని నాని ప్రెస్ మీట్ జరుగుతున్న టైం లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని నోవా టెల్ లో కలవడానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు - పవన్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాలు ఎమన్నా మాట్లాడుతున్నారేమో అంటూ నాని ఆ ప్రెస్ మీట్ లైవ్ లో మట్లాడడం గమనార్హం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేజ్ అయిన విధానం చూస్తే జనసేన పార్టీ ఈ దెబ్బకి ఏపీ ప్రజల్లో గట్టిగా రిజిస్టర్ అవడం ఖాయంగా కనబడుతుంది.
ఒకపక్క ప్యాన్ కళ్యాణ్ బిజెపి పై అసంతృప్తి వ్యక్తం చేసిన టైమ్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలవడం హిట్ టాపిక్ గా మారింది.
అయితే విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై పవన్ కి సంఘీ భావం తెలిపేందుకు వచ్చారు అని తెలుస్తుంది. ప్రస్తుతం నోవా టెల్లో పవన్-చంద్రబాబు మీటింగ్ జరుగుతుంది. ఆ వివరాలు మరో అప్ డేట్ లో..