ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జన సేనాని పవన్ కళ్యాణ్ అణుబాంబు భళ్ళున బ్రద్దలైంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా, జగన్ ప్రభుత్వం మీద, విధివిధానాల మీద పవన్ కళ్యాణ్ విజయవాడ లో కిక్కిరిసిన ప్రజా సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, జగన్ పై నిప్పులు చెరిగాడు.
వైజాగ్ లో అధికార పక్షం గర్జన తర్వాత, పవన్ కళ్యాణ్ సామరస్యంగా జనవాణి జరుపుకుందామని ముందస్తు సన్నాహాలు చేస్తే, ప్రభుత్వం కక్షసాధించి, పవన్ ని గృహనిర్బంధంలో ఉంచి, అడ్డగోలుగా జనసేన కార్యకర్తలని జైలు పాలు చేసిన తర్వాత, పవన్ విజయవాడ లో ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తన విశ్వరూపాన్ని చూపించాడు.
జగన్ ప్రభుత్వం పై, తనని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చెడుగుడు ఆడాడు. పవన్ మాట్లాడుతూ.. చెప్పు చూపించి అరేయ్ వేధవల్లారా..సన్నాసుల్లారా. చవటల్లారా.. దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, వైసీపీ గూండాగాళ్లలారా... నేరస్థులు వున్నారా మీ దగ్గరా... గుండాలున్నారు మీ దగ్గర. ఒంటి చేత్తో మెడ పిసికి కింద నొక్కేస్తా కొడకల్లారా..
ఇంకా మాట్లాడుతూ.. చెప్పు తీసి అటు తిప్పి... ఇటు తిప్పి.. పగిలిపోయేలా, దవడ వాచి పోయేలా.. చెప్పు.. చెప్పు పెట్టి కొడతా కొడకల్లారా, ఒక్కొక్కడికి తమషాలుగా వుందా కొడకల్లారా? ఇంకొక్కసారి ప్యాకేజీ స్టార్, ప్యాకేజి గీకేజీ అంటే.. చెప్పు తీస్కోనీ..ప ళ్లు రాలగొడతాను కొడకల్లారా.. అంటూ పవన్ మాట్లాడిన మాటలు, ఆయన విశ్వరూపాన్ని చూపించాయి. భాష మర్చి, స్టయిల్ మార్చిన పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎప్పుడు సంయమనం పాటించే పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వానికి దిమ్మదిరిగే విధంగా హెచ్చరించడం ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కిపోయాయి.