పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సలార్. మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సలార్ సినిమాలో ఆయన చేస్తున్న వరదరాజ్ మన్నార్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్, ఓరా అందరికీ తెలిసిందే. అలాంటి ఓ స్టార్ యాక్టర్ సలార్ సినిమాలో నటిస్తుండటం అనేది సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందనటంలో సందేహమే లేదు.
సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారందరూ స్టన్ అవుతున్నారు. వరదరాజ్ మన్నార్ పాత్ర .. ప్రభాస్ పాత్రకు ధీటుగా ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొప్ప డ్రామాను మనం సలార్ సినిమాలో చూడబోతున్నాం. అదే ఈ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండనుంది.
పృథ్వీరాజ్ సుకుమార్ చేస్తున్న పాత్ర గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. మలయాళంలో సూపర్‌స్టార్ అయిన పృథ్వీరాజ్‌గారు మా సలార్ సినిమాలో చేయటం ఎంతో ఆనందంగా ఉంది. వరదరాజ మన్నార్ పాత్రలో ఆయన కంటే గొప్పగా మరెవరూ సూట్ కారు. ఆయన ఆ పాత్రను పోషించిన తీరు అద్భుతం. తన గొప్ప నటనతో పాత్రకు న్యాయం చేశారు. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల డ్రామా నెక్ట్స్ రేంజ్‌లో ఆడియెన్స్‌కి కిక్కేంచేలా ఉంటుంది. మలయాళ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఉన్న ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పృథ్వీరాజ్, ప్రభాస్ లాంటి ఇద్దరు గొప్ప నటులను డైరెక్ట్ చేయటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అన్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన కె.జి.యఫ్ తర్వాత బాహుబలి స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సలార్ చిత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ..ఇదదరు పవర్ హౌసెస్ లాంటి యాక్టర్స్‌వారిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. వారిద్దరినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.