Advertisementt

పదేళ్ల కోటి దీపోత్సవం

Fri 07th Oct 2022 08:12 PM
ntv,koti deepotsavam  పదేళ్ల కోటి దీపోత్సవం
NTV: 10 years of Koti Deepotsavam పదేళ్ల కోటి దీపోత్సవం
Advertisement

అశేష ప్రజాశక్తి..

విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. 

కలిసివెలిగే అఖండజ్యోతి..

భక్తి టీవీ కోటి దీపోత్సవం. 

నెంబర్ వన్ న్యూస్ చానెల్ ఎన్టీవీ, భక్తిటీవీ సగర్వంగా సమర్పించే ఈ కోటి దీపోత్సవం ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకుని పదకొండో ఏట అడుగుపెట్టింది.

జగజ్జేయమానంగా వెలుగులీనే దీపకాంతులొకవైపు

ప్రవచనామృతాలు.. కళ్యాణ  కమనీయాలు మరొకవైపు

కార్తీకమాసాన కదిలివచ్చిన కైలాసమే ఈ కోటి దీపోత్సవం.

భక్తిటీవీ ఎన్టీవీ అధ్వర్యంలో పదిహేనురోజుల పాటు  జరిగే మహా వైభవం. 

శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే  యోగమే కోటి దీపోత్సవం.

జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చే పవిత్రప్రయోగమే ఈ కోటిదీపోత్సవం.

వేదికనెక్కే వేద పండితులు,

అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, 

ప్రతిరోజూ వేలు,లక్షలుగా హాజరయ్యే భక్త జనం వరకు 

అందరిదీ ఇదేమాట..

ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది..ఈ దీపోత్సవం.

ఇక  ఉత్సవిగ్రహాల ఊరేగింపు.. దానికదే చూసితీరాల్సిన ఓ మహోజ్వల ఘట్టం.

తిరుమల, యాదగిరిగుట్ట సింహాచలం, భద్రాచలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, వేములవాడ, బెజవాడలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది.

దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. 

వీటన్నిటినీ మించిన అద్భుతం ..

భక్తజనకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దేదీప్యమాన దృశ్యం.. 

కోటి కాంతులు ఒకేసారి ప్రసరించే దివ్యానుభవం.. 

దీప ప్రజ్వలనం. 

లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం చూడాలే  తప్ప మాటల్లో చెప్పలేం. 

మొత్తంగా దీపం జ్యోతి  పరబ్రహ్మ అనే దివ్యసందేశం ఇవ్వడమే ధ్యేయంగా సాగే ఈ కోటి దీపోత్సవం ఈ నెల 31సోమవారంతో మొదలై, నవంబర్ 14 వరకు హైదరాబాద్, ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో మీరూ భాగస్వాములు కావాలని ఎన్టీవీ భక్తిటీవీ మనస్పూర్తిగా ఆహ్వానిస్తుంది.

NTV: 10 years of Koti Deepotsavam:

10 years of Koti Deepotsavam

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement