Advertisementt

ఫ్యాన్ బాయ్ గా మ్యూజిక్ చేశా - తమన్

Sat 08th Oct 2022 11:33 AM
music director thaman,ss thaman interview,chiru godfather movie  ఫ్యాన్ బాయ్ గా మ్యూజిక్ చేశా - తమన్
I Will always Remember the Success of GodFather - Thaman ఫ్యాన్ బాయ్ గా మ్యూజిక్ చేశా - తమన్
Advertisement
Ads by CJ

భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి - సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ కి అద్దిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి అభిమానుల అభినందనలు అందుకుంటున్నారు సంగీత సంచలనం థమన్. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని పొందిన నేపధ్యంలో తమన్ గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్ పట్ల తన స్పందనని పంచుకున్నారు.

దసరాకి మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో విజయం అందుకున్నారు.. అదీ  ఎలా అనిపిస్తుంది ?

చాలా ఆనందంగా వుంది. నాకు హీరో ఫస్ట్ సినిమా హిట్ సెంటిమెంట్ వుంది. హీరోలతో నేను తొలిసారి కలసి పని చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మహేష్ బాబు గారితో దూకుడు, ఎన్టీఆర్ గారితో బృందావనం, పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్, బాలకృష్ణ గారితో అఖండ, రవితేజ గారితో  కిక్..  ఇలా అన్నీ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో నేను చేసిన తొలి సినిమా గాడ్ ఫాదర్ కూడా బ్లాక్ బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవి గారికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం. లండన్ లో ప్రతిష్టాత్మక అబేయ్ రోడ్ స్టూడియోస్ (Abbey Road Studios ) లో  గాడ్ ఫాదర్ స్కోర్ చేశాం. ఆ స్టూడియో అందరికీ ఇవ్వరు. అక్కడ రికార్డ్ చేసిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్.

లూసిఫర్ చూసినప్పుడే ఇందులో పాటలకు స్కోప్ లేదని అర్ధమైయింది కదా .. కానీ ఆ ప్లేస్ మెంట్స్ ని ఎలా పట్టుకున్నారు ?

ఇందులో నాకు దర్శకుడు మోహన్ రాజాకి అదే పెద్ద సవాల్. ఇందులో హై పాటలకు అవకాశం లేదు. కథని నడిపే పాటలు కావాలి. నేను, రాజా అదే విషయం చాలా మాట్లాడుకున్నాం. షూటింగ్ మొత్తం పూర్తి చేసి నాకు సినిమా చూపించారు. తర్వాత నేను, రాజా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ కూర్చుని పాటల ప్లేస్ మెంట్స్, సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. అప్పటికే ఆర్కెస్ట్రా వరకూ నేను వర్క్ పూర్తి చేశాను. ఇందులో చేసిన ఆర్ఆర్ కింగ్ డమ్ గా వుంటుంది. మా టీం అందరికీ చిరంజీవి గారంటే ఇష్టం. అందరూ ప్రాణం పెట్టి చేశారు. చిరంజీవి గారు ఒక మహా వృక్షం. ఆ వృక్షానికి నీరు పోయడం అంత తేలిక కాదు. ఎంతపోసిన ఇంకా అడుగుతూనే వుంటుంది. ఆయనకి సినిమా చేస్తున్నపుడు ఆయన గత సినిమాలతో కూడా పోలిక వస్తుంది. మణిశర్మ గారు,  కోటి గారు , కీరవాణి గారు .. ఇలా అందరూ చిరంజీవి గారి అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మనం నెక్స్ట్ లెవల్ లో ఎలా చేయాలని అలోచిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేశాం. నేను చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా ఫీలయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ.

అల వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు పాట ఫైట్ లో మిక్స్ చేశారు..ఇందులో నజభజజజరా పాటకు అదే స్ఫూర్తి ఇచ్చిందా ?

టెంప్లెట్ ఒకటే. కానీ ఇందులో కూల్ గా వుంటుంది. గాడ్ ఫాదర్ లో చాలా ఫెరోషియస్ గా వుంటుంది. చాలా పవర్ ఫుల్ ఫైట్ అది. ఆ ఫైట్ కి పాట చేద్దామనే నా అలోచన దర్శకుడు మోహన్ రాజాకి నచ్చింది. వంద చెట్లు చిరంజీవి గారితో కలసి పాడితే ఎలా వుంటుంది ? ఎంత ఇంపాక్ట్ క్రియేట్  చేస్తుంది అనే ఆలోచనతో  చేసిన ట్యూన్ అది. అనంత శ్రీరాం చాలా లోతుగా ఆ పాటని రాశారు. థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ కి ఎంత సమయం తీసుకున్నారు ?

నేపధ్య సంగీతం, డాల్బీ మిక్సింగ్ అంతా కలుపుకొని ఈ సినిమాని పూర్తి చేయడానికి 40 రోజులు పట్టింది. ఇది తక్కువ సమయంలో పూర్తి చేసినట్లే లెక్క. చిరంజీవి గారు నయనతార మధ్య వచ్చే బ్రదర్ సెంటిమెంట్ పాట లూసిఫర్ లో లేదు. గాడ్ ఫాదర్ లో అది మంచి ప్లేస్ మెంట్ లో కుదిరింది. లూసిఫర్ లో మ్యూజిక్ ఏమీ గుర్తుండదు. కానీ గాడ్ ఫాదర్ లో గుర్తుపెట్టుకునే మ్యూజిక్ చేయడం గొప్ప అనందాన్ని ఇచ్చింది. ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు అంత గొప్ప గా ఫెర్ ఫార్మ్ చేయడం వలనే ఇంత మంచి పేరొచ్చింది. దర్శకుడు మోహన్ రాజా నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ్ చరణ్, ఎన్ వి ప్రసాద్, ఆర్ బి చౌదరి గారు చాలా ప్రోత్సహించారు. సల్మాన్ ఖాన్ గారు రెమ్యునిరేషన్ కూడా తీసుకోకుండా కేవలం చిరంజీవి గారిపై వున్న ప్రేమతో చేశారు. మేమంతా మా బాస్ చిరంజీవి గారి కోసం పని చేశాం.

చిన్నపుడు మీకు  బాగా నచ్చిన చిరంజీవి గారి పాట ఏమైనా వుందా ?

చిన్నప్పుడు మా అమ్మ గారితో కలసి కోటి గారి రికార్డింగ్ కి వెళ్లాను. అందంహిందోళం పాట జరుగుతుంది. అప్పుడు నాకు ఐదేళ్ళు వుంటాయి. అప్పుడే చిరంజీవి గారికి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుండి ఒక్క సినిమా కూడా వదిలేవాడిని కాదు. ఇంట్లో ఎప్పుడూ చిరంజీవి గారి పాటలే వాయిస్తూ వుండేవాడిని.

గాడ్ ఫాదర్ కి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?

చిరంజీవి గారు ఇచ్చిన  కాంప్లీమెంట్స్ మర్చిపోలేను. దర్శకుడు శంకర్ గారు ఫోన్ చేసి అభినందించారు. మణిశర్మ, కోటి గారు కూడా ఫోన్ చేశారు. అలాగే చాలా మంది మెగా అభిమానులు ఫోన్ చేసి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మా మ్యూజిక్ టీమ్ అందరం చిరంజీవి గారితో కలసి ఈ సినిమాని చూశాం. చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రేమగా కౌగలించుకున్నారు. చాలా గ్రేట్ ఫీలింగ్. గాడ్ ఫాదర్ విజయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.!

I Will always Remember the Success of GodFather - Thaman:

Music Director Thaman Interview about Chiru GodFather Success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ