Advertisementt

అందుకే గాడ్ ఫాదర్ చేశాను: సల్మాన్ ఖాన్

Sat 01st Oct 2022 06:07 PM
godfather,godfather hindi trailer,salman khan  అందుకే గాడ్ ఫాదర్ చేశాను: సల్మాన్ ఖాన్
Salman Khan speech at Godfather hindi trailer launch అందుకే గాడ్ ఫాదర్ చేశాను: సల్మాన్ ఖాన్
Advertisement
Ads by CJ

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్  ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం..ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తారు అన్నారు

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది అన్నారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారి ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద  సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది (నవ్వుతూ). ఇద్దరు మెగా స్టార్లు కి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేదు. నా బెస్ట్ ఇవ్వడనికి ప్రయత్నించాను. మోహన్ రాజా గారు సినిమాని చాలా కూల్ గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ 5న మీ అందరినీ అలరిస్తుంది అన్నారు.

దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఇద్దరు మెగా స్టార్లుని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇస్తుంది. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి అని కోరారు.

Salman Khan speech at Godfather hindi trailer launch:

Godfather hindi trailer launch highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ