Advertisementt

థియేటర్ కి వెళ్లి గోల పెట్టాలి: కిరణ్ అబ్బవరం

Thu 15th Sep 2022 10:52 AM
nenu meeku baga kavalsinavadini,nenu meeku baga kavalsinavadini pre release event,kiran abbavaram  థియేటర్ కి వెళ్లి గోల పెట్టాలి: కిరణ్ అబ్బవరం
Nenu Meeku Baga Kavalsinavadini Pre release event థియేటర్ కి వెళ్లి గోల పెట్టాలి: కిరణ్ అబ్బవరం
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. 

సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలకు సిద్దమవవుతుంది, ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ ఈవెంట్ లో  దర్శకుడు ఎస్వీ. కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ....

ఈ సినిమాకి  శ్రీధర్ డైరెక్టర్ గా, కిరణ్ అబ్బవరం హీరోగా, అలానే నా కూతురులా నటించిన హీరోయిన్  చక్కగా చేసారు. వీళ్ళ పెరఫార్మన్స్ లు  అద్భుతంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దివ్య దీప్తిగారు. ఆవిడ ఏ సమస్య ఎవరి ముందు పెట్టకుండా తనకుతానుగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనికి మూల కారణమైన వ్యక్తి కోడి రామకృష్ణ గారు, వాళ్ళ బ్యానర్ లో సినిమా  అంటే ఎగిరి గంతేసుకుని ఒప్పుకుంటాము. నేను అదే పనిచేసాను. ఈ సినిమాకి మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  అద్భుతం క్రియేట్ చెయ్యడంలో మణిశర్మ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. అని చెబుతూ ఈవెంట్ కి హాజరైన వాళ్ళకి నమస్కారాలు తెలిపారు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ... 

ముందుగా ఈవెంట్ కి హాజరైన అతిధులకు థాంక్స్ చెబుతూ.. 

హీరోయిన్ సంజన బాగా చేసింది, అలానే సోను ఠాకూర్ కూడా బాగచేసారు. అలానే సిద్దార్థ్ మీనన్ నేను చెప్పిన సీన్స్ ను అర్ధం చేసుకుని బాగా చేసారు. అలానే లెజెండరీ డైరెక్టరైన ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సీన్స్ చెప్పినప్పుడు చిన్న చిన్న సజెషన్స్ ఇస్తుండేవారు చాలా థాంక్యూ సర్. అలానే సెకండాఫ్ లో బాబా మాస్టర్, కిరణ్ భయ్యా మధ్యలో ఒక ఫన్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో దానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నా రెండో సినిమానే మణిశర్మ గారితో చేయడం నా అదృష్టం. మంచి సాంగ్స్ తో పాటు మంచి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు అని చెబుతూ సినిమా టెక్నీషియన్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. నాకు కిరణ్ కి  షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుండి మా బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పటినుండి సినిమా చేద్దామనుకున్నాము ఒక షార్ట్ ఫిలిం తరువాత, ఎస్.ఆర్ కల్యాణమండపం సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాము. 

ఈ సినిమాలో క్లాస్, మాస్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ సినిమా మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 16 రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ... 

ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అతిధులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెబుతూ.. ప్రొడ్యూసర్ దివ్య దీప్తి గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని  ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.  హీరో కిరణ్ అబ్బవరం ఎస్.ఆర్. కల్యాణ మండపం సినిమాతో అందరికి బాగా కావాల్సినవాడు అయిపోయారు, ఈ సినిమా ఘన విజయం సాధించి పెద్దరేంజ్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

హీరోయిన్ సంజన మాట్లాడుతూ.. 

ఇంత మంచి ప్రాజెక్ట్ తో తెలుగులో డెబ్యూ చేస్తానని ఉహించలేదు. ఇది మాస్ ఎంటెర్టైనమెంట్  సినిమా అయినా కూడా ఫిమేల్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.  కృష్ణా రెడ్డి సర్ నన్ను రియల్ కూతురిలానే చూసుకున్నారు. 16న ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. 

హీరోయిన్ సోనాల్ ఠాకూర్ మాట్లాడుతూ... 

ఇలాంటి ఒక బ్యానర్  లో వర్క్ చెయ్యడం నా అదృష్టం. ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థాంక్యూ అండి. సెకండాఫ్ లో నాకు మంచి రోల్ ఉంది. 16న సినిమా రిలీజ్ అవుతుంది మీ రెస్పాన్స్ 

చూడటానికి వెయిట్ చేస్తున్నాం.

నిర్మాత దివ్య దీప్తి మాట్లాడుతూ.. 

నేను మణిశర్మ గారికి చాలా థాంక్ ఫుల్ ఉంటాను అండి. ఆయన మాకు ఇచ్చిన మ్యూజిక్, అలానే సినిమాకి ఇచ్చిన ఆర్.ఆర్ చాలా ఫాస్ట్ గా ఇచ్చారు. అలానే భాస్కర్ భట్ల గారికి, భాను మాస్టర్ కి మా టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్యూ అండి. మా డైరెక్టర్ శ్రీధర్ గారికి చాలా థాంక్స్ అండి. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా ఫాస్ట్ గా హ్యాండిల్ చేసి  మాకు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమాను కిరణ్ డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. గ్యారంటీ గా ఒక మంచి కమర్షియల్ ఎంటెర్టైమెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. కిరణ్ కి థాంక్స్ చెబితే అది చాలా చిన్న వర్డ్ అవుతుంది.అలానే మా  ఏలూరు శ్రీను గారికి, శ్యామ్ గారికి  చాలా థాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... 

ముందుగా దివంగత హీరో, నటులు అయిన కృష్ణం రాజు గారికి, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సినిమా ఒక  ప్రొపెర్ ఎంటర్టైనర్ మీ ఫ్యామిలీ తో పాటు వెళ్ళండి. మీరు సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఎమోషన్ ను తీసుకెళ్తారు.సినిమా అంటే మనం థియేటర్ లోకి వెళ్లి గోల పెట్టాలి , ఎంజాయ్ చెయ్యాలి మీరెళ్ళి సినిమా మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చెయ్యండి. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. అలానే ఈ వీక్ రిలీజ్ అవుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకినీ డాకిని సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో ఫస్ట్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రొపెర్ గా ఎంజాయ్ చెయ్యండి. ఖచ్చితంగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నన్ను అభిమానిస్తూ, నా వర్క్ ను ప్రోత్సహిస్తూ , నా భుజం తట్టేవాళ్ళకి ప్రతిఒక్కరికి థాంక్యూ సో మచ్.  సెప్టెంబర్ 16న "నేను మీకు బాగా కావాల్సిన వాడిని"  రిలీజ్ అవుతుంది సినిమా చూసి బాగా ఎంజాయ్ చెయ్యండి.

Nenu Meeku Baga Kavalsinavadini Pre release event:

Nenu Meeku Baga Kavalsinavadini Pre release event highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ