మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే నాయ్నటారా కూడా మరో పవర్ ఫుల్ రోల్ లో సత్య ప్రియా గా కనిపించబోతుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈరోజు ఈ సినిమాలో విలన్ రోల్, చిరు కి అపోజిట్ రోల్ పోషిస్తున్న సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. సత్యప్రియ జైదేవ్ గా నయనతార సత్య దేవ్ వైఫ్ కేరెక్టర్ చేస్తుంది.