Advertisementt

థ్రిల్ గురి చేసే అంశాలు రహస్య లో ఉంటాయి: నివాస్

Thu 08th Sep 2022 01:33 AM
rahasya movie,nivas sistu,nivas sistu interview  థ్రిల్ గురి చేసే అంశాలు రహస్య లో ఉంటాయి: నివాస్
Hero Nivas Sistu interview థ్రిల్ గురి చేసే అంశాలు రహస్య లో ఉంటాయి: నివాస్
Advertisement
Ads by CJ

SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.S ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు, గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర హీరో నివాస్ శిష్టు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ

మాది వైజాగ్ దగ్గర పాలకొండ, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. అయితే నాకు యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరైన వే దొరకలేదు.. NIT లో నా చదువు అయిన తరువాత నా ఫ్రెండ్ హెల్ప్ తో కెనడా వెళ్లి అక్కడ సెటిల్ అయిన నాకు ప్యాండనమిక్ టైమ్ లో థ్రిల్లర్ నేపధ్యంలోని రహస్య కథ నా దగ్గరకు రావడం జరిగింది. ఇది నా మొదటి చిత్రం ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా ఇలాంటి మంచి సినిమాలో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

మా అమ్మ చిన్నప్పటి నుంచి సోషల్ అవేర్నెస్ తో అందరికీ హెల్ప్ చేసేది. ఆలా మా అమ్మ గుణం నాకు రావడం జరిగింది. నేను అక్కడ ఉన్నా ఇండియా కు వచ్చి సోషల్ యాక్టివిటీస్ చేయాలనే కోరిక ఉండేది.. అయితే లక్కీ గా నాకు ఈ సినిమా అవకాశం రావడంతో ఇండియాకు రావడం జరిగింది. అయితే నేను నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అయితే నాకు టీం అంతా ఫుల్ సపోర్ట్ చేయడం తో నాకు నటనలో ఈజీ అయ్యింది.

ఇద్దరి ఐపియాస్ ఆఫీసర్స్ వర్క్ చేసే టైంలో వారి మధ్య ఎలాంటి ఇగోస్ ఎలా ఉంటాయి. అలాగే వారు ఒక కేస్ ను ఛేజ్ చేసే క్రమంలో వారి మధ్య ఎలాంటి క్లోజ్ నెస్ పెరుగుతుంది. ఇంకొకటి ఛేజింగ్ మిస్టరీ ఇలా ఈ సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించడం జరిగింది.

ఈ సినిమా స్క్రిప్ట్ ను గురుచరణ్ చాలా అద్భుతంగా రాశారు. చూసే అడియన్స్ అందరూ ఈ సినిమా స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు. అలాగే మ్యూజిక్ కు ఇందులో సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సునీల్ కశ్యప్ గారు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. చంద్ర కిరణ్, ఉద్ధవ్ లు కూడా సినిమా బెస్ట్ రావడానికి చాలా హానెస్ట్ గా వర్క్ చేశారు.

థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీ ని, కథను దర్శకుడు అనుకున్నట్లే చాలా బాగా తీశాడు. డైరెక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. నిర్మాతలు ఈ సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. డి.ఓ.పి సెల్వ కుమార్ ప్రతి ఫ్రేమ్ ని పెయింటింగ్ లా చాలా చక్కగా తీశారు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో హీరోయిన్స్ తో చాలా బాగా డాన్స్ చేయించారు.

తెలుగు అప్ కమింగ్ హీరోయిన్ సారా చాలా చక్కని నటనను కనబరచింది. రంగస్థలం సినిమాలో నటించిన బుగతా సత్యనారాయణ కూడా ఇందులో నటించారు. నాకు సినిమా ఫీల్డ్ కొత్త అయినా టీం అంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కష్టపడి చేయడం వలనే సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను థ్రిల్ గురి చేసే మంచి కంటెంట్ తో ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్ మా రహస్య సినిమా చూసి కచ్చితంగా ఎంగేజ్ అవుతారు. ఈ నెల 9వ తేదీ న థియేటర్స్ లో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Hero Nivas Sistu interview :

Rahasya movie Release on 9th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ