Advertisementt

సినిమా ఇండ‌స్ట్రీని వదిలి పెట్టను: నట్టి కుమార్‌

Thu 08th Sep 2022 01:17 AM
natti kumar  సినిమా ఇండ‌స్ట్రీని వదిలి పెట్టను: నట్టి కుమార్‌
Happy Birthday Natti Kumar సినిమా ఇండ‌స్ట్రీని వదిలి పెట్టను: నట్టి కుమార్‌
Advertisement
Ads by CJ

త్రీ (3) సినిమా రీ రిలీజ్ కొత్త ట్రెండ్ కు నాంది అవుతుంది.. మీడియా రంగంలోకి వస్తున్నాను.. ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా..

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే  కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేసి, నిరాడంబ‌రంగా తన బర్త్ డేని  జ‌రుపుకున్నారు. అలాగే పలు విషయాల గురించి ఈ సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడారు. 30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన నేను, ఇతర వ్యాపార రంగాల్లోనికి ప్రవేశిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితులలో సినిమా రంగాన్ని వదిలిపెట్టనని, ఇక్కడ ఉంటూనే అనేక ప్రయోగాలు చేయాలనుకుంటున్నాని ఆయన చెప్పారు. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు. అది స‌రికాదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు మొదలుకుని పెద్ద నిర్మాతలు సైతం చాలా నష్టపోయారని ఆయన వివరించారు. అసలు ఈ బండ్ ఎందుకు చేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదని ఆయన విమర్శించారు. ఇక థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డం అనేది ఎప్ప‌టికీ ఉండ‌దని, టిక్కెట్ల రేట్లు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్ ఉంటే పాత సినిమాల‌ను సైతం ఆద‌రిస్తార‌ని ఇటీవ‌ల విడుద‌లైన అగ్ర హీరోల ఒకప్పటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు రీ రిలీజ్ సందర్భంగా మరోసారి నిరూపించాయని అన్నారు. 

అలాగే ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రాల‌న్నీ కంటెంట్‌ను న‌మ్ముకుని హిట్ సాధించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. నేను కూడా అదే న‌మ్మ‌కంతో గ‌తంలో విడుద‌లై ఓ మోస్త‌రు విజ‌యం సొంతం చేసుకున్న ధ‌నుష్‌, శృతిహాస‌న్ న‌టించిన తెలుగులో త్రీ (3), త‌మిళంలో కొల‌వెరి చిత్రాన్ని అప్ప‌ట్లో మేమే విడుద‌ల చేశాము. అయితే అప్ప‌ట్లో ధ‌నుష్‌కు అంత‌గా పాపులారిటీ లేనందున పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు అదే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల‌లో విడుదల చేస్తున్నాం. ఒక్క తెలంగాణలోనే  ఇప్పటికే దాదాపు 75కు పైగా థియేట‌ర్ల‌లో వేస్తున్నాం. అన్ని షోస్ ఆన్ లైన్ బుకింగ్  ఫుల్ అయ్యాయి. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లో కూడా ఇలానే విశేష స్పందన లభిస్తోంది. 3 సినిమాకు పదేళ్ల అనంతరం రీ రిలీజ్ లో ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని మేము కూడా ఊహించ‌లేదు. అంటే ప్రేక్ష‌కులు మంచి చిత్రాన్ని ఎప్ప‌టికీ ఆద‌రిస్తార‌ని నిరూప‌ణ అయ్యింది. అంతే కాదు మంచి కంటెంట్, టిక్కెట్ల రేట్లు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనేందుకు ఈ సినిమా రీ రిలీజ్ ఓ నాంది, ఒరవడి అవుతుందని ఆయన తెలిపారు. నిర్మాత‌లు, హీరోలు అంద‌రూ కంటెంట్‌ను న‌మ్ముకుని సినిమాలు తీయాల‌ని నా అభిప్రాయం.. ఇక నా యాభ‌య్య‌వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొన్ని స‌రికొత్త ప్రాజెక్టులు చేప‌ట్ట‌బోతున్నాను. ఇందులో భాగంగా మీడియా రంగంలోనికి అడుగు పెట్టబోతున్నాను. రాజ‌కీయాల‌కు అతీతంగా నిజాన్ని నిర్భ‌యంగా చెప్పేరీతిలో నా మీడియాను నడుపుతాను. నట్టీస్ ప్యూర్ విలేజ్ ప్రొడ‌క్టుల పేరిట హోల్ సేల్‌, రిటైల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆర్డ‌ర్ పై ఇంటింటికీ స‌ప్లై ఇచ్చే మ‌రో ప్రాజెక్టు కూడా చేప‌ట్ట‌నున్నాం. మా సంస్థ నుంచి సినిమాలు వ‌స్తునే ఉంటాయి. సినిమా కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాను అని నట్టి కుమార్ తెలిపారు.

Happy Birthday Natti Kumar:

Will contest in Film Chamber elections

Tags:   NATTI KUMAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ