Advertisementt

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్‌

Mon 05th Sep 2022 05:34 PM
mahesh babu,aa ammayi gurinchi meeku cheppali,dudheer babu  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్‌
Mahesh Babu Launched Trailer Of Aa Ammayi Gurinchi Meeku Cheppali ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్‌
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు- డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో డాజ్లింగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు.

ట్రైలర్ లోకి వెళితే.. వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, వాళ్లకు సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం,చెడు అభిప్రాయం. ఇందులో సుధీర్ బాబు దర్శకుడిగా కనిపించనున్నాడు. ఈ నేపద్యంలో నటి, దర్శకుడి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథా సారాంశం. మాములుగానే చాలామందికి సినిమా ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉంటుంది. సినిమాలంటే అందరికీ ఇష్టం. కానీ ఇండస్ట్రీపై కొంతమందికి చెడు అభిప్రాయం. అందుకే తమ కుమార్తెలను ఇండస్ట్రీకి పంపేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే కథాంశంతో ఇంద్రగంటి ఈ సినిమాని తెరకెక్కించారు.

సుధీర్ బాబు యంగ్ ఫిల్మ్ మేకర్ గా చార్మింగా కనిపించాడు, ఎమోషనల్స్ ని అద్భుతంగా పండించాడు. నటిని కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి అందంగా వుంది. ఆమె పాత్ర కథపై ఆసక్తిని పెంచుతోంది. సుధీర్ బాబు, కృతి శెట్టి అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ తో నవ్వించాడు.

Mahesh Babu Launched Trailer Of Aa Ammayi Gurinchi Meeku Cheppali:

Aa Ammayi Gurinchi Meeku Cheppali trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ