ఇదొక వ్యక్తి కల.. పదిహేనేళ్ళయినా మారని పట్టుదల..
చెక్కుచెదరని సంకల్పల్పానికి మరోరూపులా..
తెలుగులో నెంబర్ వన్ న్యూస్ చానెల్ గా నిలబడ్డ వేళ..
ఇవాళ ఆ కలని, ఆ కలకన్నవ్యక్తిని తలుచుకోవడం ఒక చారిత్రక అవసరం.
ఆ కల.. ఎన్ టీవీ. ఆ వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి.
ఆగస్టు 30, 2007, న్యూస్ ఛానెల్ కి నిర్వచనమే సరిగ్గా కుదురుకోని రోజులవి. లైవ్ ప్రసారాలంటే అర్థమే పూర్తిగా స్థిరపడని కాలమది. టెక్నాలజీ ఇంకా శైశవ దశ దాటని సందర్భమది. ప్రసారమయ్యే వార్తలకి, ప్రజాహితానికీ మధ్య అప్పటికి అగాధాలుండేవి. ఆ పరిస్థితుల్లో న్యూస్ ఛానల్స్ ప్రపంచంలకి ఒక విప్లవంలా వచ్చింది.. ఎన్ టీవీ. అప్పటికే వున్న ఛానెల్స్ కి అదనంగా మరో చానెల్ లా రాలేదు. ఆ తర్వాత రాబోయే అనేక ఛానెల్స్ కి మార్గదర్శిగా వచ్చింది. అసలు న్యూస్ చానెల్స్ టెక్నాలజీ అంటే ఏంటో చూపించే చుక్కానిలా వచ్చింది. న్యూస్ కి వున్న ప్రయోజనమేంటో చాటి చెప్పే వెలుగురేఖలా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ కి మారుపేరైన ఒక ప్రభంజనంలా వచ్చింది. రావడమే కాదు..దిగ్విజయంగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకని ఈ రోజు తెలుగు న్యూస్ ఛానెల్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ దిగ్విజయ ప్రయాణమంతా ఒకే ఒక్క వ్యక్తి ఆశయంతో సాగుతోంది. ఆ వ్యక్తే తుమ్మల నరేంద్ర చౌదరి.
న్యూస్ ఛానెల్స్ కి సరికొత్త నిర్వచనంగా ఎన్టీవీ అయితే, అసలు ఆధ్యాత్మిక ఛానల్ అనే ఆలోచనకే అంకురమైంది.. భక్తి టీవీ. ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం తెలుగునాట ఒక మహోత్సవం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సంస్థనుంచి వచ్చిన మరో ఆణిముత్యం.. వనిత టీవీ. మహిళల ఆసక్తులకు, అభిరుచులకు అద్దం పట్టే వనిత టీవీ.. దానికదే ఒక విలక్షణ ప్రయోగం. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్ తీసుకురావాలన్న ఆలోచనేఒక సాహసం. ఆ సాహసం చేసింది కూడా నరేంద్ర చౌదరే.
ప్రారంభించడమే తేలికే. కానీ, మొదలు పెట్టిన పనిని దిగ్విజయంగా కొనసాగించడమే అసలు యజ్ఞం. నరేంద్రచౌదరి ఆధ్వర్యంలోని మూడు చానెళ్లూ ఆ యజ్ఞాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నాయి. ఏడాది కాలంగా ఎన్టీ వీ తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ గా కొనసాగుతోంది. ఏ బాధ్యతతో, ఏ కట్టుబాటుతో ప్రయాణాన్ని ప్రారంభించిందో.. పదహేనేళ్ళయినా.. ఇప్పటికీ అదే నిబద్ధతని నిలబెట్టుకుంటోంది. నిజానికి ఎన్టీవీ ఎంట్రీతో న్యూస్ చానెళ్ల సీన్ మారిపోయింది.
ప్రతీక్షణం.. ప్రత్యక్ష ప్రసారం..
ప్రతీక్షణం.. ప్రజాహితం అంటూ..
ఎప్పటికప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ప్రాంతం నుంచి.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారాలతో ఎన్ టీవీ ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది.. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. ఓబీ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకెళ్లింది.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి.. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలన్న లక్ష్యంతో.. కేవలం వార్తా ప్రసారాలకే పరిమితం కాకుండా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యింది.
ఆది నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది ఎన్టీవీ.. విద్యార్థులు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా జాతీయ గీతాలాపన నిర్వహించింది.. మన దేశం - మన గీతం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపనలో కోట్లాది మందిని కదిలించింది. ఇక, ఎన్నికల సర్వేలు అంటే ఎన్టీవీవి పెట్టింది పేరు.. ఎన్టీవీ సర్వేలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. అవి విశ్వసనీతకు మారుపేరుగా నిలిచాయి. ఇలా ఎన్టీవీ ఎప్పటికప్పుడు వార్తా ప్రసారాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ వచ్చింది.. అంతే కాదు.. మరో వైపు ట్రెడిషన్‌ను కూడా ఫాలో అవుతూ వచ్చింది.. కోటీదీపోత్సవం పేరుతో ప్రతీ ఏడాది ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడుపుతారంటే.. ఆ కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.. సనాత ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.. పీఠాలను, పీఠాధిపతులను, ధర్మకర్తలను ఇలా ఎంతో మందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది.. అడుగడుగునా అరుదైన విజయాలు సొంతం చేసుకుంటూ 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది.
ఈ సుదీర్ఘ దిగ్విజయ ప్రయాణంలో ఉద్యోగుల శ్రమ ఎంతుందో.. యాజమాన్య నిబద్ధత కూడా అంతే వుంది. చానెల్ ప్రసారాల్లోనే కాదు, ఉద్యోగుల బాగోగులు చూడడం లో కూడా.. అదే నిబద్ధత కనిపిస్తుంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది.. అది మీడియా రంగాన్ని కూడా తాకింది.. అలాంటి సమయంలోనూ ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలివ్వడానికి ఇబ్బందులు పడ్డాయి. కానీ, ఎన్టీవీ యజమాన్యం మాత్రం పైసా తగ్గించకుండా, ఒక్కరోజు ఆలస్యం కాకుండా ఉద్యోగులకు జీతాలను అందించింది. సమాజానికి పాత్రికేయులు, పాత్రికేయ వృత్తి ఎంతో అవసరమైన ప్రస్తుతం సందర్భంలో సక్సెస్ ఫుల్ గా 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ.. మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం. -ADVT