Advertisementt

ది ఘోస్ట్ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్

Mon 29th Aug 2022 03:32 PM
king nagarjuna,the ghost movie,praveen sattaru  ది ఘోస్ట్ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్
Nagarjuna Special Birthday Poster From The Ghost ది ఘోస్ట్ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ఘోస్ట్ తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది. ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం. తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్  వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.

Nagarjuna Special Birthday Poster From The Ghost:

King Nagarjuna Special Birthday Poster From The Ghost is out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ