Advertisementt

దసరా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్

Fri 26th Aug 2022 05:05 PM
nani,keerthy suresh,dasara movie,srikanth odela  దసరా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్
Dasara Releasing In Cinemas On 30th March దసరా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్
Advertisement
Ads by CJ

కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి దసరా చిత్రం కోసం ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నారు హీరో నాని. ఈ పాత్ర కోసం మాస్, రగ్గడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యారు నాని. సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో నాని తెలంగాణ యాస అందరినీ ఆశ్చర్యపరిచింది. నాని సినిమా అంతా మాస్ డైలాగులు పలకడం ఫాన్స్ కి పండగే. స్పార్క్ ఆఫ్ దసరా గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దసరా నిర్మాతలు బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. దసరా 30 మార్చి, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. 30మార్చి, 2023 శ్రీరామ నవమి. ఆ తర్వాత నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఉంటుంది. అలాగే వేసవి సెలవులు కూడా సినిమాకి కలసిరానున్నాయి. అన్ని భాషల్లో సినిమా విడుదలకు ఇది సరైన సమయం.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో మాస్‌గా కనిపిస్తున్నారు నాని. శరీరం, దుస్తులపై నిండి,  గుబురుగా ఉన్న జుట్టు, చేతిలో ఉన్న మద్యం సీసాతో రగ్గడ్ లుక్ లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకప్పటి పాపులర్ స్టార్ సిల్క్ స్మిత తన గోళ్లు కొరికే సిగ్నేచర్ ఫోటోని కూడా చూడొచ్చు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో నిన్నటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. నాని సరసన నేషనల్ అవార్డ్ విన్నర్  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోంది. నాని ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారు.  

Dasara Releasing In Cinemas On 30th March:

Nani, Keerthy Suresh Dasara Releasing In Cinemas On 30th March, 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ