Advertisementt

ది ఘోస్ట్ తెలుగు మూవీ ట్రైలర్ రివ్యూ

Thu 25th Aug 2022 05:51 PM
the ghost movie,the ghost movie trailer,the ghost telugu movie trailer  ది ఘోస్ట్ తెలుగు మూవీ ట్రైలర్ రివ్యూ
The Ghost Movie Trailer released ది ఘోస్ట్ తెలుగు మూవీ ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ఘోస్ట్. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు - ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడం సినిమాపై క్యురియాసిటీని పెంచింది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైయింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ది ఘోస్ట్ ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్‌కు  బెస్ట్ విశేష్ తెలిపారు.

ట్రైలర్ లో ప్రధాన పాత్రలని పరిచయం చేయడంతో పాటు కథాంశంపై క్యురియాసిటీని కలిగించింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్  విక్రమ్ (నాగార్జున) గ్యాంగ్‌స్టర్ల నుండి ముప్పు ఉన్న తన చెల్లలు మేనకోడలను సంరక్షిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కథాంశం, కథనం రెండూ ఆసక్తికరంగా వున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కనెక్ట్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా వుంది. ప్రవీణ్ సత్తారు అందరినీ ఆకర్షించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో అతని స్టైలిష్ టేకింగ్ రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందిస్తోంది.

నాగార్జున ఏజెంట్ విక్రమ్‌గా పవర్-ప్యాక్డ్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రెండీ ఎటైర్ పాటు సూట్‌లు, యూనిఫామ్‌లో కూడా తనదైన ఫ్యాషన్ తో అలరించారు. నాగార్జున సబార్డినేట్‌గా కనిపించిన సోనాల్ చౌహాన్ గ్లామర్ విందు పంచారు. 

ట్రైలర్ లో ప్రతి బిట్ గ్రిప్పింగ్, యాక్షన్-ప్యాక్డ్ గా మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తుంది. ఒక సీరియస్ మిషన్‌లో వున్న నాగార్జున పలికిన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా వున్నాయి. ఇప్పటివరకూ వున్న అంచనాలని ఈ ట్రైలర్ రెట్టింపు చేసింది.

The Ghost Movie Trailer released :

The Ghost Movie Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ