ప్రతి సినిమా కి ప్రారంభం కంటే రిలీజ్ కి ముందు క్రియేట్ అయ్యే బజ్ చాలా ఇంపార్టెంట్. కళాపురం సినిమాపై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. రియలిస్టిక్ కామెడీ తో దర్శకుడు కరుణ కుమార్ చేసిన ఈ ప్రయత్నం అందరి దృష్టినాకర్షిస్తుంది. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా కథను నమ్ముకొని చేసినవే. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలలో కథే ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు చేసిన కళాపురం కూడా ఆ వరుసలోనే నిలబడుతుంది.
సినిమా ఇండస్ట్రీ ని డ్రీమర్స్ హాంట్ అంటారు. ప్రతి ఒక్కరు తమ కలలను ఛేంజ్ చేసుకుంటూ ఇక్కడికి చేరతారు. అలా చేరిన ఒక స్ట్రగులింగ్ డైరెక్టర్ జీవితంలో వచ్చిన ఒక సినిమా అవకాశం చుట్టూ కరుణ కుమార్ అల్లిన రియలిస్టిక్ కామెడీ కళాపురం కు కొత్త లుక్ ని అందించింది. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా లో హాస్యం పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. హాస్యం గౌరవంగా ప్రజెంట్ చేయబడుతుందని దర్శకుడు భరోసా ఇస్తున్నాడు.
కొత్త కథలు కొత్త కథనాలు ఇప్పుడు ప్రేక్షకులకను ఆకట్టుకుంటున్నాయి. కళాపురం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనే గ్యారెంటీ ట్రైలర్ తో కలిగింది. ఈకథలో దొరికిన కొత్త సిట్యువేషన్స్ , ఆ సిట్యు వేషన్స్ లో పడిన ఆర్టిస్ట్ లు కళాపురంలో నవ్వుల విందు పంచుతారు. సెన్సార్ రిపోర్ట్ కూడా కళాపురం పై అంచనాలను పెంచింది. దర్శకుడు కరుణ కుమార్ ముందు చేసిన రెండుసినిమాల కథలు సీరియస్ ఇష్యూ పై నడిస్తే ఈ కళాపురం పూర్తి వినోదం ప్రధానంగా సాగుతుంది. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రియలిస్టిక్ కామెడీ సరదాగా ప్రేక్షకుల్ని నవ్వింస్తుందనే నమ్మకం కలుగుతుంది.