Advertisementt

ఆకట్టుకుంటోన్న ‘నా మాటే వినవా’ టీజర్!

Sat 20th Aug 2022 09:22 PM
naa maate vinava movie,teaser,kriishna,kiran chetvani,sai kumar,naa maate vinava teaser  ఆకట్టుకుంటోన్న ‘నా మాటే వినవా’ టీజర్!
Naa Maate Vinava Movie Teaser Out ఆకట్టుకుంటోన్న ‘నా మాటే వినవా’ టీజర్!
Advertisement
Ads by CJ

కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా శివానీ ఆర్ట్స్, పీఎస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నా మాటే వినవా’. శ్రీనివాస్ యాదవ్, పి వినయ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన కిరణ్ చేత్వాణి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

 

‘పెళ్లి తరువాత బేదాభిప్రాయాలతో విడిపోవడం కన్నా.. పెళ్లికి ముందు మనం ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం మంచిదని నా ఆలోచన’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. మనిద్దరం ఒకే రూంలో ఉంటున్నామని హీరోయిన్ అనడం.. కానీ మనం వయసులో ఉన్నాం.. కొంచెం కష్టమంటూ హీరో కొంటెగా చెప్పే డైలాగ్ బాగుంది. ఇక చివర్లో సాయి కుమార్ చెప్పిన ‘ఆధునికత మంచిదే కానీ నాగరికతను మరిచిపోకూడదు.. వాయిస్ నాది చాయిస్ మీది’ డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్‌ను తెలియజేస్తోంది. ఓవరాల్‌గా రొమాన్స్, యాక్షన్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాలను అలరించే కంటెంట్‌తోనే ఈ చిత్రం రాబోతోందని తెలుస్తోంది.

 

టీజర్‌లో యెల్లెందర్ మహవీర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా ఉంది. మనోహర్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. థ్రిల్లర్ మంజు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పొరెడ్డి వీరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గణయాది ఈ చిత్రంలోని పాటలకు లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, అనంత్, జబర్దస్త్ రాఘవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Click Hero for Teaser

Naa Maate Vinava Movie Teaser Out:

Naa Maate Vinava Movie Teaser Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ