Advertisementt

సెప్టెంబర్ 23న దొంగలున్నారు జాగ్రత్త

Fri 19th Aug 2022 07:12 PM
dongalunnaru jagratha 2022 telugu movie,sri simha koduri movie dongalunnaru jagratha,samudrakhani in dongalunnaru jagratha movie  సెప్టెంబర్ 23న దొంగలున్నారు జాగ్రత్త
Dongalunnaru Jagratha Theatrical Release On September 23rd సెప్టెంబర్ 23న దొంగలున్నారు జాగ్రత్త
Advertisement
Ads by CJ

డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు తెలిపారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్‌గా కనిపిస్తుండగా సముద్రఖని నుదుటిపై వేళ్లు పట్టుకుని విసుగు చెందినట్లు కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. పోస్టర్‌లో కారును కూడా గమనించవచ్చు. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ ఆసక్తికర చిత్రానికి చెందిన మరిన్ని వివరాలు త్వరలో.!

Dongalunnaru Jagratha Theatrical Release On September 23rd:

dongalunnaru jagratha is first survival thriller film in Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ