డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఒకేఒక జీవితం. ఇప్పటికే ఈ సినిమా టీజర్, అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందాయి. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం తమిళంలో కణం పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.