Advertisementt

టైగర్ నాగేశ్వరరావుకి బాలీవుడ్ హంగులు

Tue 02nd Aug 2022 04:32 PM
national award,anupam kher,mass maharaja,ravi teja,tiger nageswara rao  టైగర్ నాగేశ్వరరావుకి బాలీవుడ్ హంగులు
Anupam Kher On board For Tiger Nageswara Rao టైగర్ నాగేశ్వరరావుకి బాలీవుడ్ హంగులు
Advertisement
Ads by CJ

రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు పై లాంచింగ్ రోజు నుండే భారీ హైప్ నెలకొంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత సినిమా కోసం వేసిన భారీ సెట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డ్ గ్రహీత, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్‌ లో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని చేరిక సినిమా కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ స్థాయిని పెంచడమే కాకుండా హిందీ మార్కెట్‌కు కూడా సహాయపడుతుంది.

టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన స్టువర్ట్‌పురం దొంగ బయోపిక్ గా 70 నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. డిక్షన్‌, డైలాగ్ డెలవరీ, గెటప్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటూ, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Anupam Kher On board For Tiger Nageswara Rao:

Legendary National Award Winning Actor Anupam Kher On board For Mass Maharaja Ravi Teja Tiger Nageswara Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ