యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, మాచర్ల యాక్షన్ ధమ్కీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మాచర్ల నియోజకవర్గం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు. రారా రెడ్డి పాటలోని రానురాను అంటుంది చిన్నదోయ్ పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు.
రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌తో మాస్ ఫీస్ట్ గా మెస్మరైజ్ చేసింది.
రాజప్ప గా సముద్రఖని విలన్ ఎంట్రీ టెర్రిఫిక్ గా వుంది. మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు. ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది.
నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.
ట్రైలర్‌లోని యాక్షన్ షాట్‌లు అడ్రినాలిన్ రష్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి. అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్ సెన్సేషనల్ గా వుంది. శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.
మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ యాక్షన్ , ఎంటర్‌టైన్‌మెంట్ గా సినిమాపై భారీ అంచనాలని పెంచింది. మాంచి యాక్షన్, ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మాచర్ల నియోజకవర్గం పర్ఫెక్ట్ బాక్సాఫీసు ఫీస్ట్ అని చెప్పాలి.
ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది.
ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. సై హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడు ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత అఆ హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే మాచర్ల నియోజకవర్గం హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ , ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలి. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ఎలా వుందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఆగస్ట్ 12 సినిమా వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాలో పాటలని హిట్ చేశారు. అలాగే సినిమాని కూడా చూసి పెద్ద హిట్ చేయండి. ఈ ఈవెంట్ ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి స్పెషల్ థాంక్స్. బాలయ్య బాబు గారి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నప్పటికీ నా కోసం వచ్చారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తో పని చేయడం ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు సాగర్ మంచి పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆగస్ట్ 12 థియేటర్ లో డైరెక్ట్ యాక్షనే అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ యాక్షన్ చూడలేదు. అదిరిపోయే మాస్ వైబ్ ఇచ్చింది ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి మరో నిర్మాణ భాగస్వామి హరి.. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా మిగతా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. నితిన్ గారి ఇరవై ఏళ్ల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలని చూసి తన హార్డ్ వర్క్ తో మళ్ళీ టాప్ లో నిలబడ్డారు. ఇలానే నితిన్ గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి. భవిష్యత్ లో మేము కలసి పని చేయాలని కూడా కోరుకుంటున్నాను అన్నారు
కృతి శెట్టి మాట్లాడుతూ.. భారీగా తరలివచ్చి మీ ప్రేమని పంచని అభిమానులు కృతజ్ఞతలు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి థాంక్స్. నితిన్ రానురాను పాటకు డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఇరవై ఏళ్ల క్రితం ఎలా వున్నారో ఇప్పటికీ అదే ఫ్రెష్ నెస్ తో వున్నారనిపిస్తుంది. ఆయన మంచి మనసు వలనే ఇది సాధ్యపడింది. సముద్రఖని, కేథరిన్ థ్రెసా తో పని చేయడం అందాన్ని ఇచ్చింది. దర్శకుడు రాజశేఖర్ గారి ఫస్ట్ మూవీ ఇది. నా ఫస్ట్ మూవీ ఉప్పెన ఎంత సక్సెస్ అయ్యిందో ఆయని మాచర్ల ఆలాంటి సక్సెస్ ఇవ్వాలి, నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితాలకి థాంక్స్ తెలిపారు.
నికితారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ గుంటూరు లో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. అభిమానులు భారీ ఎత్తున ఈ వేడుకకు రావడం ఇంకా ఆనందంగా వుంది. డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఆగస్ట్ 12 తప్పకుండా ఈ సినిమా చూసి చాలా పెద్ద విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను.
సముద్రఖని మాట్లాడుతూ .. మాచర్ల నియోజక వర్గం ఎక్స్ ట్రార్డినరీ కమర్షియల్ మూవీ . ఇంత గొప్ప చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నితిన్ గారితో గడిపిన ఒకొక్క రోజు మర్చిపోలేనిది అన్నారు
కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ .. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో జాయ్ ఫుల్ , బబ్లీ గర్ల్ పాత్ర చేశాను. నితిన్ గారు ఈ చిత్రంలో మాస్ పవర్ ఫుల్ రోల్ కనిపిస్తారు. ఆగస్ట్ 12న సినిమా విడుదలౌతుంది. ప్రేక్షకులంతా థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అని కోరారు
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నితిన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు మొదట అవకాశం ఇచ్చిన హీరో నితిన్ అన్న. నితిన్ అన్న సాంగ్ అంటే ప్రాణం పెట్టి చేస్తాను. ఇందులో ఐటెం సాంగ్ మీ అందరినీ అలరిస్తుంది. నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి దర్శకుడు రాజశేఖర్, అంజలి , చిత్ర యూనిట్ కి థాంక్స్ అన్నారు.