రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న యాక్టర్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం సార్. ఈరోజు ధనుష్ పుట్టినరోజు
సందర్భంగా సర్ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ధనుష్ సార్ టీజర్ పరికిస్తే యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు. టీజర్ లోకి వెళితే..
జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్
మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పటి ట్రెండ్.
ఓ లెక్చరర్ త్రిపాఠి మన కాలేజ్ లోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీ కి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు...! అంటారు..
సమాధానంగా మనం పంపేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని... అని..
సార్... మై సెల్ఫ్
బాల గంగాధర్ తిలక్
త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్..
అంటూ ఇందులో మనకు కనిపించే సార్
విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే
నైవేద్యం తో సమానం. పంచండి ...
ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి అంటాడు కథానాయకుడు ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో.... ముగింపుగా
విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా సాగే
ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు
సార్ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు సరైన బహుమతి అన్నట్లుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుకున్నాయి.