హీరో నితిన్ నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్న చిత్ర యూనిట్ ఇప్పడు మాచర్ల మాస్ లోడింగ్ అంటూ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చింది. జులై 23 న థర్డ్ సింగల్ అదిరిందే పాటని విడుదల కానుంది. జూలై 26న మాచర్ల ధమ్కి రాబోతుంది. జూలై 29న మాచర్ల నియోజకవర్గం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.