Advertisementt

జులై 22న మీలో ఒకడు

Mon 18th Jul 2022 05:51 PM
meelo okkadu,meelo okkadu movie,kuppili srinivas  జులై 22న మీలో ఒకడు
Meelo Okkadu Movie july 22nd జులై 22న మీలో ఒకడు
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ మ‌రో ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్టు మూవీ రాబోతోంది. శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం మీలో ఒకడు. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్, సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A  స‌ర్టిఫికేట్ సొంతం చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 24 క్రాప్ట్స్ పై నాకు అవగాహ‌న లేదు.. కానీ మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. డీ  గ్లామ‌ర్ గా ఉన్న న‌న్ను డీఓపీ పి.శ్రీను అందంగా చూపిస్తే.. డైలాగ్ రైట‌ర్ ధ‌ర‌ణికోట శివ‌రాం ప్ర‌సాద్ గారు మంచి డైలాగ్స్ రాసి సినిమా కు బ‌లం చేకూర్చారు. ఓ స్టార్ న‌టుడు కి కంపోజ్ చేసే.. ఫైట్స్ నాకు కూడా హంగామా కృష్ణ గారు కంపోజ్ చేశారు. ఈ నెల 22 రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాల‌ని కోరారు.

తెలుగు చిత్ర నిర్మాత‌ల మండలి సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ... కుప్పిలి శ్రీనివాస్ ఇంటిరియ‌ర్, క‌న‌స్ట్ర‌క్ష‌న్ ఫీల్డ్ లో ఉంటున్నా.. సినిమా మీద ఇష్టంతో.. హీరోగా, నిర్మాతగా, ద‌ర్శ‌కుడిగా అన్ని తానై మీలో ఒక‌డు రూపోందించ‌డం గొప్ప విష‌యం అన్నారు.. ట్రైల‌ర్, సాంగ్స్ అవుట్ పుట్ బాగా ఉంద‌ని అన్నారు.. కెమెరా మెన్ శ్రీను పిక్చ‌రైజేష‌న్ బాగా తీశార‌ని ప్ర‌శంసించారు. ఈ నెల 22 న రిలీజ్ అవుతున్న మీలో ఒక‌డు స‌క్సెస్ అయి, డ‌బ్బులు రావాల‌ని.. కుప్పిలి శ్రీనివాస్ మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని ఆశీర్వ‌దించారు.

నిర్మాత రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ఓ సినిమా నిర్మించ‌డం మాములు విష‌యం కాదు.. ఓ నిర్మాతగా ఆ క‌ష్టాలు నాకు తెలుసు.. కుప్పిలి శ్రీనివాస్ బ‌ల‌మైన  సంక‌ల్పంతో ఈ సినిమాను పూర్తి చేశారు. కొత్త వాళ్ల‌ను ఆద‌రిస్తే.. మ‌రిన్ని సినిమాలు వ‌స్తాయి.

Meelo Okkadu Movie july 22nd:

Meelo Okkadu Movie july 22nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ