Advertisementt

థాంక్యూ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది

Sun 17th Jul 2022 06:24 PM
thank you,thank you pre release event,naga chaithanya  థాంక్యూ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది
Thank You Pre Release Event థాంక్యూ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది
Advertisement
Ads by CJ

యువ సామ్రాట్ అక్కికేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్రమంలో.. 

అక్కినేని నాగ చైత‌న్య మాట్లాడుతూ వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావ‌టానికి ప్రేక్షకులే కార‌ణం. వారికి థాంక్యూ చెప్ప‌టానికి వ‌చ్చాను. అభిమానుల‌కు ఎంత థాంక్స్ చెప్పినా స‌రిపోదు. తాత‌గారు, నాన్న‌గారిని చూసి యాక్ట‌ర్ కావాల‌ని ఇన్‌స్పైర్ అయ్యాను. కానీ నేను ఈవాళ సినిమాను ప్రేమించి చేశానంటే అభిమానులు, ప్రేక్ష‌కులే కార‌ణం. అది నా బాధ్య‌త అని మీరు గుర్తు చేస్తుంటారు. ఆ బాధ్య‌త‌ను నిల‌బెట్టుకోవ‌టానికి ఎప్ప‌టికీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాను. మీకు మంచి సినిమా ఇవ్వాల‌నేదే నా ల‌క్ష్యం. నేను ఇంకా మంచి మంచి సినిమాలు చేయ‌డానిక ట్రై చేస్తూనే ఉంటాను. మా కేరాఫ్ అడ్ర‌స్ అభిమానుల‌ని మీ ఎన‌ర్జీ చూస్తేనే అనిపిస్తుంది. అభిమానుల‌కే అభిమానులు మా అక్కినేని అభిమానులు. మనం ఎక్క‌డ మొద‌ల‌య్యామో మ‌రిచిపోతే చేరిన గ‌మ్యానికి విలువ ఉండ‌దని థాంక్యూ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ గురించి ఆలోచించిన‌ప్పుడు నాకు వైజాగ్ గుర్తుకు వ‌స్తుంది. ఎక్క‌డో నా స‌క్సెస్ స్టోరి పెద్ద రీజ‌న్ వైజాగ్‌. నేను వైజాగ్‌లో షూటింగ్ చేసిన ప్ర‌తీ సినిమా. నాకు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఇవ్వ‌టంతో పాటు హీరోగా నెక్ట్స్ స్టెప్‌కి తీసుకెళ్లింది. కొన్ని సినిమాల‌ను కథ‌గా చెప్పొచ్చు. కానీ వాటిని థియేట‌ర్‌లో చూసిన త‌ర్వాతే ఆ మూమెంట్స్ ఫీల్ అయ్యాకే మ‌న‌ల్ని ట‌చ్ చేస్తుంది. మ‌నం రోజు థాంక్యూ అనే ప‌దాన్ని వాడుతుంటాం. కానీ అవ‌స‌రం ఉన్న చోట వాడం. థాంక్యూ ప‌దానికి అస‌లు అర్థాన్ని థాంక్యూ సినిమా నేర్పించింది. సినిమా చూసిన త‌ర్వాత మీరు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. థాంక్యూ చెప్ప‌టానికి సిగ్గు ప‌డ‌కూడ‌దు. థాంక్యూ సినిమాను చేసిన రాజుగారికి ముందు థాంక్స్ చెప్పాలి. ఆయ‌న‌కు క‌థ న‌చ్చ‌గానే విక్ర‌మ్, పీసీగారు స‌హా పెద్ద టీమ్‌తో స‌పోర్ట్ చేశారు. నాకు బంగారంలాంటి సినిమా ఇచ్చారు. ఆయ‌నకు ఎప్ప‌టికీ థాంక్‌ఫుల్‌గా ఉంటాను. మ‌నంలాంటి సినిమా ఇచ్చిన డైరెక్ట‌ర్ విక్ర‌మ్ .. అలాంటి గొప్ప సినిమామాను థాంక్యూ రూపంలో ఇవ్వ‌బోతున్నాడు. ర‌వి ఈ క‌థ‌ను ఇచ్చాడు. త‌ను స‌త్యం సినిమా నుంచి నాకు తెలుసు. మ‌జిలీ సినిమాను త‌మ‌న్ ఏడు రోజుల్లో ఎలా చేశాడో నాకు తెలియ‌దు. బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. త‌మ‌న్ మ‌జిలీ సినిమాకు మంచి సంగీతంతో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడు అలాగే థాంక్యూ సినిమాకు ప్రాణం పెట్టి చేశాడు. ప్ర‌తి పాట అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ కూడా అలాగే ఉంది. త‌న‌కు కూడా థాంక్యూ. పీసీగారికి వంద సార్లు థాంక్యూ చెప్పిన స‌రిపోదు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌టం నా డ్రీమ్‌. ఈ సినిమాతో అది నేర‌వేరింది. అలాగే ఎడిట‌ర్ న‌వీన్ , రాశీ ఖన్నా, మాళ‌విక, అవికా గోర్, ప్ర‌కాష్ రాజ్‌గారు, తుల‌సి గారు ఇలా చాలా మంచి యాక్ట‌ర్స్ మా సినిమాలో ఉన్నారు. జూలై 22న మీ ముందుకు రాబోతున్నాం,అన్నారు. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ వైజాగ్‌తోమంచి అనుబంధం ఉంది. అక్కినేని అభిమానులు ఎన‌ర్జీ జూలై 22 వ‌ర‌కు ఉంచుకోండి. చైత‌న్య‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద్భుతంగా చూసి ఎంజాయ్ చేస్తారు. థాంక్యూ ఐడియాను స్టోరిలాగా ర‌వి చెప్పిన‌ప్పుడు పాయింట్ న‌చ్చింది. ఈ పాయింట్‌ను చెప్పాలంటే మంచి జ‌ర్నీ కావాల‌ని త‌న‌తో చెప్పాను. ఆ జ‌ర్నీ ఎలా ఉంటుందో రేపు థియేటర్స్‌లో చూస్తారు. ఈ జ‌ర్నీని నా లైఫ్‌కి చెక్ చేసుకున్నాను. లైఫ్‌లో అన్ని చూసి వ‌చ్చిన వాడిని. సోల్‌ఫుల్‌గా చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ‌దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. థాంక్యూ అని చాలా ఈజీగా వాడేస్తుంటాం. కానీ .. మ‌న జీవితంలో ఇపార్టెంట్స్ ప‌ర్స‌న్ .. అమ్మ నాన్న‌, గురువు, తోబుట్టువులు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది ఉంటారు. మ‌న అంద‌రీ జీవితాల్లోనూ ఈ ప్ర‌యాణం ఉంటుంది. నా లైఫ్ జ‌ర్నీని వెన‌క్కి చూసుకుని చాలా మందికి థాంక్యూ చెప్పాల‌నిపించింది .ఇంత దూరం వ‌చ్చానంటే ఇది నా ఒక్క‌డి వ‌ల్ల‌నే కాలేదు. ఎంతో మంది స‌పోర్ట్ చేశారు. అందులో ముందుగా అమ్మ నాన్న‌కి థాంక్స్. ఎందుకంటే జ‌న్మ‌ను ఇవ్వ‌ట‌మే కాదు.. మంచి చెడులు చెప్పించి మంచి వ్య‌క్తిని తీర్చిదిద్దారు. నా సోద‌రులు, సిస్ట‌ర్స్ అంద‌రికీ థాంక్స్‌. నా చ‌దువు అయిపోయిన‌ప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు వ్యాపారంలో స‌పోర్ట్ చేసిన వారికి థాంక్యూ. 

సినిమా అంటే ప్యాష‌న్‌. నాకు ఏమీ తెలియ‌దు. వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా అల్లుడా మ‌జాకా సినిమాతో వ్యాపారం స్టార్ట్ చేశాను. ఆరోజు న‌న్ను ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చిన మ‌హేందర్ రెడ్డిగారికి థాంక్స్‌. నాకు మొద‌టి స‌క్సెస్ ఇచ్చిన పెళ్లి పందిరి నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ‌గారికి థాంక్స్‌. కోడి రామ‌కృష్ణ‌గారికి థాంక్స్‌. స‌క్సెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ స‌మ‌యంలో నా స‌తీమ‌ణి అనిత‌.. 27 ఏళ్ల నా ప్ర‌యాణంలో అండ‌గా నిల‌బ‌డింది. న‌న్ను ముందుకు వెళ్లేలా చేసింది. నిర్మాత‌గా మారిన‌ప్పుడు దిల్ సినిమా ఇచ్చిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 50 సినిమాలు పూర్తి చేస్తున్న‌ప్పుడు .. సపోర్ట్ చేసిన ద‌ర్శకులు.. టాప్ స్టార్స్ అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు, నాని, చైత‌న్య‌.. అంద‌రికీ థాంక్స్‌. ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌. రేపు సినిమా చూస్తే నా ఎమోష‌న్ మీకు అర్థ‌మ‌వుతుంది. రేపు సినిమాలో చైత‌న్య మూడు వేరియేష‌న్స్ స్క్రీన్‌పై చూస్తారు. థాంక్యూ సినిమాలో బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరి, కాలేజ్ స్టోరి, లైఫ్ స్టోరి ఉంటుంది. చైత‌న్య మూడు వేరియ‌షన్స్‌ను అద్బుతంగా చేసిన చైత‌న్య‌కు, చేయించుకున్న విక్ర‌మ్‌కు థాంక్స్‌. త‌మ‌న్ ప్రేక్ష‌కులకు హ‌త్తుకునేలా సినిమాకు సంగీతాన్ని అందించారు. పీసీగారు సినిమాను అంద‌మైన పెయింటింగ్‌లా చేశారు. రాశీ ఖ‌న్నా, మాళ‌వికా, అవికా థాంక్స్‌. మూడేళ్ల క‌ష్టం జూలై 22న మీ ముందుకు వ‌స్తుంది. సినిమా అద్భుతంగా ఉంటుంది అన్నారు.

డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ మా నాన్నగారికి, నా ప్రియమైన స్నేహితుడు చైతన్యకి, పీసీ శ్రీరామ్ గారికి థాంక్స్. బ్రిలియంట్ యాక్టర్స్‌తో క‌లిసి న‌టించాను. చైత‌న్య ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. త‌ను ఇంకా ఎంతో సాధించాలి. సాధిస్తాడు. ఇంత మంచి సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. మంచి క‌థ‌ను ఇచ్చిన దిల్ రాజు, ర‌విగారికి, మ్యూజిక్ అందించిన త‌మ‌న్‌, ఎడిట‌ర్ న‌వీన్ నూలికి, నా డైలాగ్ రైట‌ర్స్ స‌హా అంద‌రికీ థాంక్స్ అన్నారు.  

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ మనం లైఫ్ జ‌ర్నీలో ఈ స్థాయికి రావ‌టానికి ఎంతో మంది సాయం చేసుంటారు. అమ్మ‌, నాన్న‌, గురువు, ఫ్రెండ్స్ ఇలా ఎంద‌రో స‌పోర్ట్ చేసుంటారు. వారెవ‌రూ లేక‌పొతే మ‌నం ఏ ప‌ని చేయ‌లేం. చిన్న సూది, దారం కూడా చేయ‌టం ఒకరి వ‌ల్లే కాదు. నా జీవితంలో జ‌రిగిన మంచి విష‌యంలో థాంక్యూ సినిమా చేయ‌టం. ఈ సినిమాకు సంగీతం అందించే స‌మ‌యంలో నా గురువులు కీర‌వాణిగారు, మ‌ణిశ‌ర్మ‌గారు, రాజ్ కోటిగారికి థాంక్స్ చెప్పాను. మొన్న మ‌ణిశ‌ర్మ‌గారికి పార్టీకి వెళ్లి ఆయ‌న్ని హ‌గ్ చేసుకుని థాంక్యూ సార్‌! మీ వ‌ల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పాను. ఈ సినిమా న‌న్ను అలా చేయించింది. సినిమా న‌న్ను అంత‌లా క‌దిలించింది. థాంక్యూ సినిమా చూసిన త‌ర్వాత మీకు స‌పోర్ట్ చేసిన వారందరూ మీ మైండ్‌లో క‌దులుతారు. మ‌న జీవితంలో జ‌రిగిన అన్ని విష‌యాలు.. గుర్తుకు వ‌స్తాయి. దిల్ రాజుగారు చిన్న పిల్లాడిలా సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. సినిమాలో వ‌చ్చిన డ‌బ్బుల‌ను సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేయ‌టం ఆయ‌న గ్రాట్యీట్యూడ్‌. బృందావ‌నం నుంచి రాజుగారు ఎంతో స‌పోర్ట్ చేశారు. డైరెక్ట‌ర్ విక్ర‌మ్ గురించి చెప్పాలంటే.. త‌ను చాలా మంచి వ్య‌క్తి. మ‌నం సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. కానీ ఇంత వండ‌ర్‌ఫుల్ సినిమా ఇచ్చినందుకు విక్ర‌మ్‌కి థాంక్స్‌. మ‌జిలీ సినిమా చూసి ప్రేమ‌లో ప‌డిపోయాను. చైత‌న్య‌కి థాంక్స్‌. ఈ సినిమాలో త‌ను అద్భ‌తంగా ఉన్నాడు. ఇందులో మూడు, నాలుగు గెట‌ప్స్‌లో క‌నిపిస్తాడు. క‌మిట్‌మెంట్‌తో సినిమా చేశాడు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

రైట‌ర్ బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ థాంక్యూ అనే పదం గురించి చెప్పడానికి.. పదం డెప్త్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మేం మాకు వీలైనంత మేరకు ఆ డెప్త్ గురించి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాం. గ్రాట్యిట్యూడ్ అనే ప‌దం మ‌న గుండెల్లో నుంచి రావాలి. ఫ్రెండ్ షిప్ చిన్న చిన్న గొడ‌వ‌ల కంటే చాలా గొప్ప‌ది. దాన్ని గుర్తు చేసుకునే ప్ర‌య‌త్న‌మే థాంక్యూ సినిమా. నాకు చాలా ఇష్ట‌మైన బాబాయ్ చ‌నిపోయిన‌ప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధం గురించి సోష‌ల్ మీడియాలో రాస్తున్న‌ప్పుడు ఆయ‌న‌తో ఉన్న అనుబంధం ఇంత గొప్పగా ఉందా? అనిపించింది. దాంతో నేను ఓ క‌థ‌ను త‌యారు చేసి రాజుగారికి చెప్పాను. అందులోని ఎమోష‌న్‌ను ఆయ‌న గుర్తించారు. ఇలాంటి ఎమోష‌న్‌ను ఏ డైరెక్ట‌ర్‌తో చెప్పిస్తే బావుంటుంద‌ని ఆలోచిస్తే విక్ర‌మ్ కుమార్‌గారు గుర్తుకొచ్చారు. అలాగే ఏ హీరో ఈ క‌థ చెబితో బావుంటుందా అని ఆలోచించాం. గులాబీ రేకులాంటి మ‌నిషి చెబితే బావుంటుంది. తేనె ధారవంటి వ్య‌క్తి చెబితే బావుంటుంది. మంచివాడి కోపంలాంటి ప్యూరిటీ ఉన్న వ్య‌క్తి చెబితే బావుటుందనిపించింది. ఆ మ‌నిషి నాగ చైత‌న్య‌. అలాంటి ఆయ‌న ఈ క‌థ‌ను చెబితే సంపూర్ణం వ‌స్తుంద‌నిపించింది. రాకెట్ పైకెళ్లేట‌ప్పుడు బ‌రువుల‌న్నీ వ‌దిలించుకుంటుంది. రాకెట్ అనుకుంటుంది.. ఈ బ‌రువుల‌న్నీ వ‌దిలించుకోవ‌టం వ‌ల్లే నేను పైకి వెళుతున్నాన‌ని, కానీ రాకెట్‌ను అంత వ‌ర‌కు మోసుకెళ్లి.. ఇంకా పైకి వెళ్లాలంటే మ‌నం వ‌దిలేయాల‌నుకునే ఆ బ‌రువులు గొప్ప‌వి. మ‌నల్ని పైకి తీసుకెళ్లే ఆ బ‌రువులు మ‌నం వెన‌క్కి తిరిగి చూస్తే వ‌స్తాయి. మ‌నం ఇంత దూరం ఎలా వ‌చ్చాం.. అని ఆలోచించి వారంద‌రికీ థాంక్యూ చెప్పే సినిమానే ఇది. చాలా సినిమాలు వ‌స్తాయి. కానీ కొన్ని సినిమాలే ఉండిపోతాయి. అలా ఉండిపోయే సినిమానే థాంక్యూ. మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌, రాశీ ఖ‌న్నా, సుశాంత్‌.. మ‌హా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఇలా వీరంతా మోసిన రాకెట్ క‌థే ఇది. వీళ్లంద‌రూ క‌లిసి గెలిపించిన అభిరామ్ క‌థే థాంక్యూ. త‌మ‌న్ ప్యూర్ సోల్ పెట్టి మ్యూజిక్ చేశారు. జూలై 22న థాంక్యూ సినిమాను ప్రేక్ష‌కులు ముందుకు తీసుకెళతారు. ఈ సంద‌ర్భంగా నాకు రైట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన నాగార్జున‌గారికి, ఓర్పు నేర్పించిన దిల్ రాజుగారికి, ఆలోచ‌న నేర్పించిన రామ్ గోపాల్ వ‌ర్మ‌గారికి, ఆనందం నేర్పించిన రాఘ‌వేంద్ర రావుగారికి... న‌న్ను భ‌రించిన నా  భార్య‌కు, న‌న్ను భ‌రిస్తున్న మా అమ్మ‌గారికి థాంక్స్‌ అన్నారు.

Thank You Pre Release Event:

Naga Chaithanya Thank You Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ