Advertisementt

5 బిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప ఆల్బమ్..

Wed 13th Jul 2022 07:11 PM
pushpa,pushpa songs,allu arjun,devisri,sukumar  5 బిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప ఆల్బమ్..
Pushpa Songs Created Massive Record 5 బిలియన్ వ్యూస్ సాధించిన పుష్ప ఆల్బమ్..
Advertisement
Ads by CJ

 పుష్ప సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది పుష్ప. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. 

దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఊఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఏం చెప్పాలి..? పుష్ప సినిమాలోని ప్రతీ విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది. ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. పుష్ప అదే కంటిన్యూ చేసింది.

Pushpa Songs Created Massive Record:

Pushpa album Created Massive Record

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ