Advertisementt

మేజర్ స్పెషల్ పార్టీ

Tue 12th Jul 2022 04:13 PM
sashi kiran tikka,major,major success  మేజర్ స్పెషల్ పార్టీ
Sashi Kiran Tikka Grand Party మేజర్ స్పెషల్ పార్టీ
Advertisement
Ads by CJ

ముంబై ఉగ్రదాడుల అమరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా మేజర్ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్కా. కేవలం బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ సినిమా ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టే సినిమా అయ్యింది. జూన్ 3 పాన్ ఇండియా మూవీగా విడుదలైన మేజర్ బాలీవుడ్ సహా అన్ని భాషల్లో సూపర్ హిట్టయ్యింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమా మొదటి స్థానం లో  హిందీ  వెర్షన్  రెండవ  స్థానం లో  తెలుగు వెర్షన్ వారం రోజుల ట్రేండింగ్ లో నిలిచాయి. వీటితో పాటు మెజర్ పాకిస్థాన్,  బంగ్లాదేశ్,  శ్రీలంక వంటి దేశాలలో టాప్ ప్లేస్ లో  నిలిచి ట్రెండింగ్ మూవీ అయ్యింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల దాకా మేజర్ సినిమాను ప్రశంసించారు.

ఈ గొప్ప సక్సెస్ ను పురస్కరించుకుని మేజర్ సినిమా టీమ్ కు స్నేహితులకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. సినిమా విజయాన్ని తన సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్కా. ఈ పార్టీకి ప్రకాష్ రాజ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీచరణ్ పాకాల, నిర్మాత నాగవంశీ, అభిషేక్ అగర్వాల్, అభిజీత్ తదితరులు హాజరయ్యారు. గుఢఛారి సినిమాతో దర్శకుడు అరంగేట్రం చేసిన శశికిరణ్...మేజర్ సక్సెస్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Sashi Kiran Tikka Grand Party :

Sashi Kiran Tikka Grand Party for Major Cast and close friends

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ